వార‌సుని రాక అనేది 20 సంవత్సరాల ప్రేమ ప్రాజెక్ట్

Update: 2021-07-02 03:54 GMT
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు ఉపాస‌న కామినేనిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2012లోనే ఈ జంట వివాహం జ‌రిగింది. ఈ తొమ్మిదేళ్ల‌లో చ‌ర‌ణ్-ఉపాస‌న ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా పూర్తి బిజీ జంట‌. ఉపాస‌న అపోలో హెల్త్ మ్యాగ‌జైన్ స‌హా ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంటారు. మ‌రోవైపు అపోలో ఆస్ప‌త్రుల్లో కీల‌కమైన ప‌ద‌విలోనూ ఉన్నారు. ఉపాస‌న ఆధ్యాత్మిక భావ‌జాలం దానికి తోడు యోగా జిమ్ వంటి ఫిట్నెస్ అంశాల‌పై అపార ప‌రిజ్ఞానం క‌లిగి ఉన్నారు. హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ పై ప‌లు యూట్యూబ్ చానెళ్ల‌ను మ్యాగ‌జైన్ ని నిర్వ‌హిస్తున్నారు.

మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ టాలీవుడ్ లో కెరీర్ పరంగా అంతే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి అనంత‌రం చ‌ర‌ణ్ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయారు. వ‌రుస‌ స‌క్సెస్ ల‌తో ఇప్పుడు మ‌రింత‌గా బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. వృత్తిప‌ర‌మైన వ్యాప‌కాల‌లో చ‌ర‌ణ్ - ఉపాస‌న ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నార‌ని చెప్పాలి. ఇంత బిజీలోనూ ఈ జంట వినోద విహార‌యాత్ర‌ల్ని మిస్ చేయ‌దు.

అయితే ప్ర‌తిసారీ ఈ జంట‌కు ఎదుర‌య్యే ఒకే ఒక్క‌ ప్ర‌శ్న‌.. పిల్ల‌లు క‌లిగేదెపుడు? ఆ ఆనంద‌క‌ర క్ష‌ణాల కోస‌మే తాము కూడా ఎదురు చూస్తున్నాన‌ని ఆ స‌మ‌యం వ‌స్తుంద‌ని చెబుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి సైతం చ‌ర‌ణ్ వార‌సుల‌ రాక కోసం ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నామ‌ని ప‌లుమార్లు నివేదించారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఉపాస‌న దీనిపై ముచ్చ‌టించారు.  పిల్ల‌లు కావాల‌ని కోరుకుంటున్నామ‌ని..  సమయం వచ్చినప్పుడు ప్ర‌తిదీ జరుగుతుందని ఉపాస‌న అన్నారు. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన‌ది. పిల్లలు ముఖ్యం కానీ.. ఇది 20 సంవత్సరాల ప్రేమ‌ ప్రాజెక్ట్.. అని అన్నారు. ``మేం పిల్ల‌ల‌కు పూర్తిగా అంకితమ‌వ్వాలి. దానికి అవ‌స‌మైన‌ జ్ఞానాన్ని పొందుతున్నాము. మా పిల్లలను అర్ధహృదయంతో పెంచడం మాకు ఇష్టం లేదు. ఈ గ్రహంలోకి ఒకరిని తీసుకువస్తుంటే మీ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. ఆ పిల్లవాడిని బాగా పెంచుకోవాలి`` అని తెలిపారు.

``ఇది మనం అంకితం చేయాల్సిన 20 సంవత్సరాల ప్రేమ ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి సమయం వచ్చినప్పుడు అది జ‌రుగుతుంది. మనం మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి`` అని అన్నారు. కొంత విచారం ఉందని ఉపాస‌న అన్నారు. ఒకరిని ప్రపంచంలోకి తీసుకురావడం మాకు నిజంగా విలువైనది. కాబట్టి మేము పూర్తిగా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము.. అని అన్నారు.
Tags:    

Similar News