నవంబర్ నెలలో ఇప్పటి వరకూ అనేక చిన్న మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి. గత శుక్రవారం పలు చిన్న చిత్రాలు సందడి చేయగా.. ఈ వారం కాస్త పేరున్న సినిమాతో పాటుగా డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. అలానే ఓటీటీలలోనూ ఈ వీక్ లో కావాల్సినంత వినోదం అందుబాటులోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో - నెట్ ఫ్లిక్స్ - ZEE5 - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - సోనీ లివ్ ఓటీటీలు సరికొత్త కంటెంట్ ను అందించడానికి రెడీ అయ్యాయి.
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. నవంబర్ 25న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ వారం విడుదలయ్యే చిత్రాల్లో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన హీరో సినిమా ఇదొక్కటే. అదే ఈ చిత్రానికి ప్లస్ అవ్వొచ్చు.
బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్ - కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన క్రీచర్ కామెడీ చిత్రం ''తోడేలు''. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ ద్వారా ఈ డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరి దృష్టి పడింది.
అగ్ర నిర్మాత దిల్ రాజు వారం 'లవ్ టుడే' అనే తమిళ్ డబ్బింగ్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్ - రాధికా శరత్ కుమార్ - యోగిబాబు - రవీనా రవి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక వీటితో పాటుగా 'రణస్థలి' అనే మరో చిన్న సినిమా నవంబర్ 26న అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తోంది.
నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న "మీట్ క్యూట్" అనే ఆంథాలజీ సిరీస్ నవంబర్ 25 నుండి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. నాని సోదరి దీప్తి ఘంటా ఈ సిరీస్ కి దర్శకత్వం వహించింది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. ఇందులో సత్యరాజ్ - రోహిణి మొల్లేటి - అదా శర్మ - వర్షా బొల్లమ్మ - ఆకాంక్ష సింగ్ - రుహాని శర్మ - సునయన - సంచిత - అశ్విన్ కుమార్ - శివ కందుకూరి - దీక్షిత్ శెట్టి - గోవింద్ పద్మసూర్య - రాజా తదితరులు నటించారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచనలనం సృష్టించిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ''కాంతారా'' నవంబర్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోన్న ఈ చిత్రం.. తెలుగులో 65 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ''చుప్'' కూడా ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హిందీ చిత్రం నవంబర్ 25 నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ - శ్రేయా ధన్వంతరి - పూజా భట్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అదే రోజున ఆహా ఓటీటీలో టివినో థామస్ నటించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
తమిళ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''ప్రిన్స్''. సునీల్ నారంగ్ - సురేష్ బాబు - పుస్కుర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 25 నుండి డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. అలానే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అదే రోజున నీరజ్ పాండే దర్శకత్వం వహించిన 'ఖాకీ' సినిమా.. నివిన్ పౌలీ నటించిన 'పాద వెట్టు' సినిమాలు రాబోతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.