ఒకప్పుడు టాలీవుడ్ లో హవా చూపించిన చాలామంది స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఫేడ్ ఔట్ దశలో ఉన్నారని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి రోజుకొక న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ వస్తున్న తరుణంలో సీనియర్ దర్శకులకి అవకాశాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఒకరిద్దరు తప్ప ఒకప్పుడు సీనియర్ అగ్ర దర్శకులు అనిపించుకున్న వాళ్ళెవరూ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అలాంటి డైరెక్టర్స్ కొంతమంది టాలీవుడ్ లో మళ్ళీ నిరూపించుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. వారిలో ముందుగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఒకరని చెప్పవచ్చు. 'దిల్' 'ఆది' 'ఠాగూర్' 'బన్నీ' 'లక్ష్మి' 'కృష్ణ' 'అదుర్స్' 'ఖైదీ నెం.150' వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన వినాయక్.. 'ఇంటెలిజెంట్' ప్లాప్ తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆయన మీద నమ్మకంతో పిలిచి మరీ 'లూసిఫర్' రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఈ సినిమాతో ఎలాగైనా కమ్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.
టాలీవుడ్ లో ప్లాప్ డైరెక్టర్ గా ముద్రపడిపోయిన మెహర్ రమేష్.. 'షాడో' సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అందరూ మర్చిపోయిన మెహర్ కి ఏడేళ్ల తర్వార్ మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. దీనికి కోసం తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'వేదాలమ్' సినిమాని ఎంచుకున్నారు. ఈ రీమేక్ తో ఎలాగైనా హిట్ డైరెక్టర్ అనిపించుకోవాలని కసితో స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన మెహర్ రమేష్.. సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. ఇక 'బొమ్మరిల్లు' సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన భాస్కర్.. 2013 'ఒంగోలు గిత్త' సినిమా తర్వాత ఇండస్ట్రీలో కనిపించలేదు. అయితే ఇప్పుడు అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని కసితో వర్క్ చేస్తున్నాడు.
'కొత్త బంగారు లోకం' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల.. 'బ్రహ్మోత్సవం' సినిమాతో సీరియల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ళ తర్వాత విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లో మళ్ళీ ప్రూవ్ చేసుకోడానికి ట్రై చేస్తున్నాడు. అలానే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ ఇండస్ట్రీని ఏలిన శ్రీను వైట్ల కూడా కమ్ బ్యాక్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. 'దూకుడు' 'బాద్ షా' సినిమాల తర్వాత హిట్ అంటే ఏంటో చూడని శ్రీను వైట్ల.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా తీయాలని ట్రై చేస్తున్నాడు. అవకాశం వస్తే 'దూకుడు' రేంజ్ సక్సెస్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. అయితే వీళ్లంతా హిట్ సాధించి కెరీర్ ని ముందు మాదిరిగా కొనసాగిస్తారేమో చూడాలి.