క్లిక్‌ క్లిక్‌ : ఏదో దీర్ఘాలోచనలో ఉన్న సిద్ద

Update: 2022-04-26 16:30 GMT
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆచార్య సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్‌ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ ఈ సినిమా తో తన జైత్ర యాత్రను కంటిన్యూ చేయడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఆచార్య సినిమాలో మొదట సిద్ద పాత్రను గెస్ట్‌ రోల్‌ అనుకున్నారు. కాని సిద్ద పాత్ర ప్రాముఖ్యత మరియు ఆ పాత్రను చేసేందుకు చరణ్‌ ఆసక్తి చూపించడం.. సురేఖ గారు కూడా చిరంజీవి మరియు చరణ్ కలిసి నటిస్తే చూడాలి అనుకోవడం వంటి కారణాల వల్ల సిద్ద పాత్రను పెంచారు. అంతే కాకుండా ఆయనకు జోడీగా హీరోయిన్ ను కూడా పెట్టడంతో సినిమా లో ఆయన పాత్ర ప్రాముఖ్యత పెంచారు.

సినిమాలో ఆయన పాత్ర ప్రాముఖ్యత నేపథ్యంలో చిరంజీవి రోల్‌ ను సైతం కాస్త తగ్గించారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చిరంజీవికి జోడీగా హీరోయిన్ పాత్ర ను లేపేశారు. సిద్ద పాత్ర కోసం చాలా మార్పులు చేర్పులు చేశారు. అంతగా మార్పులు చేయడం వల్ల సినిమాలో సిద్ద పాత్ర ఖచ్చితంగా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

సిద్ద లుక్ విడుదల అయినప్పటి నుండి కూడా మెగా ఫ్యాన్స్‌ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. సిద్ద లుక్ చాలా డీసెంట్‌ అండ్ కూల్ గా ఉంది. చిరంజీవితో ఆయన ఉన్న పోస్ట్‌ లు మరియు స్టిల్స్ చూస్తూ ఉంటే అంతా కూడా చరణ్ వైపే చూసేలా ఉన్నాడు అనడంలో సందేహం లేదు. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన ఈ పోస్టర్స్ కూడా సినిమా పై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి.

చరణ్ ఈ స్టిల్స్ లో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. సిద్ద పాత్ర లోతును తెలుసుకునేందుకు ఈ స్టిల్స్ ఉపయోగపడుతున్నాయి. చాలా డీసెంట్‌ పాత్ర అవ్వడంతో పాటు చాలా బలమైన పాత్ర అని ఆ ఫోటోలను చూస్తుంటే అర్థం అవుతుంది అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చరణ్ ఆర్ ఆర్‌ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కనీసం నెల రోజులు కూడా రాలేదు. అప్పుడే ఆచార్య సినిమా తో రాబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఆచార్య తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తో రాబోతున్నాడు. వచ్చే ఏడాదిలోనే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చరణ్ చేయబోతున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News