తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సమయంలోనే అతి త్వరలోనే మళ్లీ కొత్తగా మీ ముందుకు వస్తాం అంటూ నాగార్జున ప్రకటించాడు. అన్నట్లుగానే ఓటీటీ ద్వారా మూడు నెలల గ్యాప్ లోనే కొత్త బిగ్ బాస్ ను మొదలు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈనెల చివరి వారంలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ తెలుగు కంటెస్టెంట్స్ విషయమై గత నెల రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి కనిపిస్తుంది.
హిందీ ఓటీటీ బిగ్ బాస్ తరహాలో కాకుండా తెలుగు ఓటీటీ ని కొత్తగా మరింత ఆకర్షణీయంగా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. రెగ్యులర్ బిగ్ బాస్ కు ఏమాత్రం తగ్గకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ బిగ్ బాస్ కు కూడా హోస్ట్ గా నాగార్జునను తీసుకు వస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయంలో కూడా రాజీ పడకుండా మరింత వినోదాన్ని అందించే వారిని తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పాత కంటెస్టెంట్స్ ఓటీటీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తారనే వార్తలు వచ్చాయి.
ఆ వార్తలు నిజమే అన్నట్లుగా ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఓటీటీ బిగ్ బాస్ ను నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ను ఇవ్వబోతుంది.. అంతే కాకుండా పాత కొత్త కలయికతో ఈ షో ఉంటుందని చెప్పుకొచ్చారు. దాంతో పాత కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు అంటూ క్లారిటీ వచ్చేసింది. పాత కంటెస్టెంట్స్ మెజార్టీ శాతం ఉంచి.. కొత్త వారికి కాస్త తక్కువగా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఇక పాత సీజన్ ల నుండి తీసుకున్న కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఆదర్శ్ బాలకృష్ణ.. మహేష్ విట్ట.. అరియానా.. సరయు.. నటరాజ్ మాస్టర్.. అషు రెడ్డి.. అఖిల్.. తేజస్వి ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు మాత్రమే కాకుండా ముమైత్ ఖాన్ మరియు ధన్ రాజ్ ల పేర్లను కూడా పరిశీలించారనే వార్తలు వస్తున్నాయి. చివరి జాబిత లో ఈ ఇద్దరి పేర్లు ఉన్నాయా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
పాత కంటెస్టెంట్స్ కు ఏమాత్రం తగ్గకుండా కొత్త కంటెస్టెంట్స్ కూడా ఉండబోతున్నారు. యాంకర్ శివ సోషల్ మీడియాలో బాగా ఫేమస్. అతడిని ఈ షో కోసం అడగడం మొదట ఆయన నో చెప్పడం మళ్లీ ఓకే చెప్పడం జరిగిందట. ఆయన మాత్రమే కాకుండా మరికొంత మంది సోషల్ మీడియా సెలబ్రెటీలను మరియు సినీ బుల్లి తెర కు సంబంధించిన సెలబ్రెటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది.
నేడో రేపో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ క్వారెంటైన్ కు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. వారం నుండి పది రోజుల పాటు వీరు క్వారెంటైన్ లో ఉంటారని తెలుస్తోంది. క్వారెంటైన్ లో ఉన్న సమయంలోనే వారిపై ఏవీ లు మరియు డాన్స్ వీడియోలను షూట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బూస్టర్ డోస్ లతో సహా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక సెట్ ఇప్పటికే రెడీ అయ్యింది. అదే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ ను కొత్తగా డిజైన్ చేశారు.
24 గంటల ఎంటర్ టైన్మెంట్ తో బిగ్ బాస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అంతా సిద్దం అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ షో ను ఫిబ్రవరి 26వ తారీకున మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సాదారణ బిగ్ బాస్ అయితే ఆదివారం మొదలు పెడతారు. కాని ఈ షో ను మాత్రం శనివారంనే మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఆధరణ బట్టి ఎపిసోడ్స్ ను పెంచబోతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.