స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇటీవల నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఇది మరీ పరాకాష్టకు చేంది. ఏకంగా హీరోలని కూడా తమ గొడవల్లోకి లాగేసి కించపరుస్తున్నారు. కొంత మందైతే హద్దులు దాటి కామెంట్ లు చేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీసేదిగా మారుతోంది. నచ్చని హీరో సినిమా విడుదలవుతోందంటే మరో హీరో బ్యాచ్ నెట్టింట సదరు హీరో గురించి ప్రాపగండా మొదలుపెట్టడం.. సినిమాని తొక్కేసే తరహాలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఫ్యాషన్ గా మారింది.
అయితే హీరోలు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇదిలా వుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల అభిమానుల మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.
బన్నీనటించిన బ్లాక్ బస్టర్ సినిమా సంగీతాన్నిమహేష్ బాబు సినిమా కోసం తమన్ వాడేస్తున్నాడని, ఈ విషయంలో అతని నుంచి ఒరిజినల్ మ్యూజిక్ ని రాబట్టుకుంటే మంచిదని బన్నీ అభిమానులు నెట్టింట సెటైర్లు వేస్తున్నారట. అంతే కాకుండా హద్దులు దాటి మహేష్ బాబుపై కామెంట్ లు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
బన్నీ నటించిన 'పుష్ప' రిలీజ్ తరువాత మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా బన్నీని, డైరెక్టర్ సుకుమార్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ చిత్రాన్ని ముందు మహేష్ తో చేయాలనుకున్నారు సుకుమార్. అయితే క్యారెక్టర్ మరీ రఫ్ గా ఊర మాస్ గా వుండటంతో మహేష్ తను ఈ పాత్రని చేయలేనని చెప్పేయడం వల్లే అదే కథని బన్నీతో చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. అలాంటి సినిమా బన్నీ చేస్తే మహేష్ ప్రశంసలు కురిపించారు. చాలా స్పోర్టీవ్ గా తీసుని చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.
దానికి బన్నీ కూడా కూల్ గా రిప్లై ఇచ్చారు. ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహ పూర్వకమైన వాతావరణం వుంది. అయితే ఈది సదరు హీరోల అభిమానుల మధ్య ఇప్పడు కనిపించడం లేదు. అదే ప్రధాన చర్చగా మారింది. మహేష్ ఫ్యాన్స్ , బన్నీ ఆర్మీ కలిసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే మూడ్ లో లేరని స్పష్టమవుతోంది. ఈ ఇద్దరి అభిమానుల హీరోలు స్నేహితులుగా మారితే ఫ్యాన్స్ మాత్రం సమరానికి కాలుదువ్వుతున్నారు.
కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి.. మహేష్ వైఫ్ నమ్రత హోస్ట్ చేసిన ఓ పార్టీలో పాల్గొంది. అక్కడి ఇద్దరూ హ్యాపీగా కలిసి పార్టీని ఎంజాయ్ చేశారు. కానీ అభిమానుల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. వీరిని గమనించిన వారంతా ఎలా ఐక్యంగా వుండాలో మెగా , ఎన్టీఆర్ అభిమానుల్ని చూసి నేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.