ఒక వర్గం బాగా ఎంజాయ్ చేస్తున్నారు...

Update: 2016-08-16 11:30 GMT
'తిక్క' సినిమా జనాలను డిజప్పాయింట్ విషయం చేసిన నిజమే. కాకపోతే ఇక్కడే అందరూ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. అసలు తిక్క వంటి సినిమాలను యాక్సెప్ట్ చేసేంత గట్స్ ఆడియన్స్ కు ఉన్నాయా అని. ఎందుకంటే 'హ్యాంగ్ ఓవర్' సినిమా చూసిన ప్రతీ ఒక్కరు.. ఇలాంటి సినిమాలు మన దగ్గర రావేంటి అంటూ కామెంట్లు చేస్తుంటారు. యాజీటీజ్ హ్యాంగ్ ఓవర్ లా తీస్తే కాపీ అంటారు. కాని తిక్క లా కొత్తగా తీస్తే.. తిప్పికొడతారు. ఇలాగైతే ఎలా? చెప్మా?

నిజంగానే చాలామంది ఆరెంకల జీతగాళ్ల జీవితం.. తిక్క సినిమాలో చూపించినట్లే ఉంటుంది. ఇంకొకరి గాళ్‌ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చేయడం.. డబ్బులతో జల్సా చేయడం. రోజూ తాగుడు.. ఖరీదైన పబ్బుల్లో డ్యాన్సులు.. లగ్జరీ లైఫ్‌.. వగైరా వగైరా జరుగుతుంటాయి. అయితే ఈ అర్బన్ ట్రెండ్ ఇప్పుడు మాస్ ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అవ్వలేదు. అందుకే కేవలం అర్బన్ ఆడియన్స్ మాత్రమే సినిమాను కాస్తోకూస్తో ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే తిక్క సినిమాలో చూపించిన.. హిజ్రాలతో శృంగారం.. చాలామంది అబ్బాయిలు గే సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం.. ఇవన్నీ కూడా చాలా మెట్రో రేంజ్ కాన్సెప్టులే. అందుకే ఊళ్ళలో కనెక్ట్ కాలేదు.

ఇకపోతే సినిమాలో సెకండాఫ్‌ రొటీన్ అయిపోయింది కాని.. ఒకవేళ ఆ నెరేషన్లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నాకూడా.. సినిమా రేంజ్ ఇంకోలా ఉండేదేమో. కాకపోతే ఈ సినిమా కేవలం అర్బన్‌ బాబులకే ఎక్కడం.. దానికితోడు సరైన ప్రమోషన్లు చేయకపోవడం.. సినిమా బాక్సాఫీస్ అంచనాలను దెబ్బేశాయి.  తమ ప్రోమోలతో అసలు ముందే సినిమా కథేంటో బాగా జనాల్లోకి చెప్పేసుంటే.. సినిమా రీచ్ బాగుండేమో.

Tags:    

Similar News