ఈ శుక్రవారం ‘బాబు బంగారం’ భారీ అంచనాల మధ్య రిలీజవుతున్నా.. మరుసటి రోజే ‘తిక్క’ సినిమాను రిలీజ్ చేసేయడానికి రెడీ అయిపోయాడు నిర్మాత రోహిన్ రెడ్డి. సినిమా మీద ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉండి ఉండొచ్చు. కానీ ఈ సినిమా మీద జనాల్లో మాత్రం అనుకున్నంతగా హైప్ లేదు. దీని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది.
అందరి దృష్టి ‘బాబు బంగారం’ మీదే ఉంది ప్రస్తుతం. దాని బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కానీ ‘తిక్క’ గురించి జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. బుకింగ్స్ మరీ డల్లుగా ఉన్నాయి. సాయిధరమ్ గత సినిమా ‘సుప్రీమ్’ మంచి హిట్టయినా.. ‘తిక్క’కు అంత హైప్ రాలేదు ఎందుకనో. పైగా ‘బాబు బంగారం’కు పోటీ వెళ్లడం ప్రతికూలమవుతోంది. శుక్రవారం ఈ వెంకీ సినిమా విడుదలైపోయాక పరిస్థితి మారొచ్చేమో చూడాలి.
‘ఓం త్రీడీ’ లాంటి డిజాస్టర్ తో దర్శకుడిగా పరిచయమైన సునీల్ రెడ్డి ఈ సినిమాను రూపొందించడం.. హీరోయిన్లు పేరున్న వాళ్లు కాకపోవడం లాంటి ప్రతికూలతల వల్ల ‘తిక్క’కు అనుకున్నంత హైప్ రాలేదని అర్థమవుతోంది. ఐతే ఈ సినిమా కంటెంట్ విషయంలో సాయిధరమ్ తో పాటు దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారు. విడుదలకు ముందు పరిస్థితి ఎలా ఉన్నా.. టాక్ బాగుంటే అంతా సర్దుకుంటుందన్నది ఆశ. మరి ‘తిక్క’ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూద్దాం.