బిబి5 ఫినాలే స్టేజ్ పై మూడవ సినిమా..!

Update: 2021-12-19 00:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్‌ రేపు భారీగా ఉండబోతుంది. ఇప్పటికే బాలీవుడ్‌ మూవీ 83 తెలుగు వర్షన్ ను ప్రమోట్‌ చేయడం కోసం రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలా బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు స్టేజ్‌ పై సందడి చేయబోతున్నారట. వీరిద్దరు తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నారు. మొదటి సారి ఒక తెలుగు రియాల్టీ షో లో బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ గెస్ట్‌ లుగా కనిపించబోతున్నారు. 83 సినిమా తో పాటు ఆర్‌ ఆర్ ఆర్ ప్రమోషన్ ను కూడా బిగ్ బాస్ సీజన్‌ 5 తెలుగు స్టేజ్ పై చేసేందుకు గాను రాజమౌళి రెడీగా ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి మాత్రమే వస్తాడా లేదా తన అల్లూరి.. భీమ్ లను కూడా తీసుకు వస్తాడా అనేది చూడాలి. ఇక మూడవ సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్యామ్‌ సింగ రాయ్ ను కూడా బిబి స్టేజ్ పై ప్రమోట్‌ చేయబోతున్నారు.

షో మొత్తం దాదాపుగా నాలుగు గంటల పాటు కొనసాగబోతుంది. కనుక మెల్ల మెల్లగా ఒక్కో సినిమా చొప్పున ప్రమోట్‌ చేస్తూ ఉండవచ్చు. అయితే విజేతను మాత్రం ప్రకటించే సమయంలో రాజమౌళి స్టేజ్ పై ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి షో ఆరంభంలో 83 చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి చేయబోతున్నారు. మద్యలో నాని తన ఇద్దరు శ్యామ్‌ సింగరాయ్ హీరోయిన్స్‌ అయిన సాయి పల్లవి మరియు కృతి శెట్టిలతో కలిసి స్టేజ్ ఎక్కబోతున్నాడు. చివర్లో ఆర్ ఆర్‌ ఆర్‌ రంగ ప్రవేశం ఉంటుంది. గతంలో నాని బిగ్‌ బాస్ కు హోస్టింగ్‌ చేశాడు. అప్పుడు హోస్ట్‌ గా బిగ్‌ బాస్ స్టేజ్ పై నిల్చున్న నాని ఇప్పుడు గెస్ట్‌ గా తన సినిమా ప్రమోషన్ కోసం స్టేజ్ ఎక్కబోతున్నాడు.

నాని బిగ్‌ బాస్ సీజన్ కు హోస్టింగ్‌ చేసిన సమయంలో చాలా నెగిటివిటీని మూట కట్టుకున్నాడు. మరీ దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో ఒక కంటెస్టెంట్‌ కు చెందిన అభిమానులు ప్రతి విషయంలో కూడా ఆయన్ను టార్గెట్‌ చేయడం జరిగేది. దాంతో నాని చిరాకు పెట్టి తదుపరి సీజన్ కు తన వల్ల కాదని చెప్పేశాడు అని టాక్. ఇప్పుడు నాని మళ్లీ బిగ్‌ బాస్ స్టేజ్ పై సందడి చేయబోతున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది పరిస్థితి.. ఆ సమయంలో నాని ఫీలింగ్ ఏంటీ అనేది చూడాలంటే రేపటి ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇన్ని రోజుల బిగ్‌ బాస్ ఎపిసోడ్‌ లు ఒక ఎత్తు అయితే రేపటి ఎపిసోడ్‌ ఒక ఎత్తు అనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఇక విజేత విషయానికి వస్తే ఖచ్చితంగా సన్నీ అంటున్నారు. సన్నీ విన్నర్‌.. షన్నూ రన్నర్ గా ఉంటారని అంటున్నారు. మద్యలో ఏదైనా అటు ఇటు అయితే ఈ ఫలితంలో తేడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.
Tags:    

Similar News