'మెగా - అల్లు' కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ సైతం రెండు వర్గాలుగా చీలిపోయి నెట్టింట తరచుగా వార్స్ కు దిగుతూ.. ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్నా.. ఈ కుటుంబాల్లో ఏ ఒక్కరు కూడా రూమర్స్ పై నోరు విప్పలేదు. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఈ పుకార్లపై స్పందించారు.
కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ఓ సెలబ్రిటీ టాక్ షోకి అల్లు అరవింద్ ఇటీవల గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'అరవింద్ ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీకి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. వారికి మీ సమాధానం ఏంటి?' అని అలీ ప్రశ్నించారు. దీనికి అరవింద్ స్పందిస్తూ.. ''సమాజంలో ఇలా అనుకోవడం చాలా సహజం. నేను, చిరంజీవి 80స్ నుంచి చాలా క్లోజ్ గా ఉండు5వస్తున్నాం. మేము బావ బావమరుదులుగా కాకుండా... మంచి స్నేహితులుగా ఉన్నాం. అలానే జీవితంలో పైకి వచ్చాం'' అని అన్నారు.
''మేం పైకి వస్తున్న క్రమంలో పిల్లలు పుట్టారు.. కుటుంబాలు పెరిగాయి. పిల్లలు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. ఇంత చిన్న ఫిలిం సొసైటీలో వీరందరూ అవకాశాలు పంచుకోవాలి. కాబట్టి కాంపిటేషన్ అనేది తప్పదు. అందరూ పోటీతత్వంతో పెరుగుతూ.. ఎవరి స్థానాన్ని వాళ్ళు తీసుకుంటూ పైకి ఎదుగుతున్నారు. అలాంటి సందర్భంలో ఇలా అనుకోవడం సహజమే కానీ.. ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. వీళ్లందరూ ఒక్కటే. వీళ్లల్లో ఎవరిని ఏమన్నా అందరూ ఒక్క మాట మీద ఉంటారు. ఈ విషయం అందరికీ తెలియడం చాలా ముఖ్యం.
ఉదాహరణకు ఇటీవల నాన్నగారు అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాలు అందరి ఫ్యామిలీలు వచ్చి కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. సంక్రాంతి పండుగ రోజు నాన్నకు నైవేద్యం పెట్టిన తర్వాత మా కుటుంబం అంతా చిరంజీవి గారి ఇంటికి వెళ్లిపోతాం. దీపావళి రోజున అన్ని ఫ్యామిలీలు కలిసి చిరంజీవి గారి ఇంటికి చేరుకుని అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఇప్పటికీ అలానే జరుగుతూ వస్తోంది. ఇవ్వన్నీ అందరికీ తెలియాలని మేము వీడియోలు తీసి మీడియాలో పెట్టం కదా. ఎవరి కాంపిటేషన్ లో వాళ్ళు పైకి వస్తున్నారు తప్పితే.. వీళ్లంతా ఒక్కటే అని ప్రజలు తెలుసుకోవాలి'' అంటూ రూమర్స్ పై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో చిరంజీవిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు?' అని అలీ ప్రశ్నించగా.. ఒకసారి పనిమీద స్నేహితుడు చలసాని గోపి ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎవరో చిరంజీవిని పరిచయం చేశారు. ఆ సమయంలో ఒకరికి ఒకరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. అంతే. ఆ షేక్ హ్యాండ్ ఇన్ని సంవత్సరాలుగా చేతిలో చెయ్యి పట్టుకొని నడుస్తాం అనుకోలేదు అని అల్లు అరవింద్ తెలిపారు.
'చిరంజీవిని ఇంటి అల్లుడిని చేసుకోవాలన్న ఆలోచన ఎవరిది?' అని ప్రశ్నించగా.. దానికి నాంది మా అమ్మ గారి ఆలోచన. మా ఇంటి పైన సత్యనారాయణ అనే ఆయన ఉండేవాడు. ఒకసారి చిరంజీవి ఆయన్ని కలవడానికి మా ఇంటికి వచ్చి. ఆయనతో మాట్లాడి తిరిగి వెళ్లిపోతూ మా అమ్మకు చెప్పి వెళ్ళాడు. సత్యనారాయణను పిలిచి చిరంజీవి గురించి మా అమ్మ 'మన వాడేనా?' అంటూ వివరాలు అడిగి తెలుసుకుంది. రాత్రి నాన్న ఇంటికి వచ్చాక ఆయనకు చెప్పింది. మొదట్లో నాన్న ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. అయినా మా అమ్మ వదల్లేదు.. తర్వాత నాకు చెప్పింది.
'మన ఊరి పాండవులు' సినిమా షూటింగ్ కోసం చిరంజీవితో కలిసి నాన్న గారు 20 రోజులు రాజమండ్రి లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు చిరంజీవి గురించి సీఐడీ వర్క్ మొదలు పెట్టారు. పాపం.. అది చిరంజీవి గారికి తెలియదు. చిరంజీవి ఎలాంటి వాడు అని వివరాలు తీసుకొని మంచివాడు అని నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత డీవీఎస్ రాజుని అడిగి నిర్ణయం తీసుకున్నారు అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
నటన వైపు వెళ్లకుండా ప్రొడక్షన్ వైపు రావడం గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఓ సీన్ కోసం పది టేకులు అయ్యాక దర్శకుడు విసుక్కున్నారని మా అమ్మతో నాన్న గారు చెబుతూ బాధ పడ్డారు. ఆ సంఘటన బలంగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత చాలా రోజులకు చిరంజీవి నటించిన 'చంటబ్బాయ్' సినిమాలో అందరూ బలవంతపెడితే ఒక పాత్ర చేశా. ఆ పాత్ర మంచి ప్రేక్షకాదరణ పొందింది.
'నిర్మాతగా ఉంటే డబ్బులు వస్తాయో రావో తెలియదు. అదే నటిస్తే ఆ సమస్య ఉండదు. యాక్టర్ అవ్వచ్చు కదా?' అని ఓరోజు నాన్న పిలిచి అడిగారు. నేను మరుసటి రోజు ఉదయం నాన్న దగ్గరకు వెళ్లి 'నేను ఎప్పుడూ యజమాని అవ్వాలనుకున్నా కానీ, ఉద్యోగి కావాలని అనుకోలేదు' అని చెప్పా. ఆ తర్వాత ఓ మంత్రి ద్వారా నాకు బ్యాంక్ లో ఉద్యోగం ఇప్పించాలని చూశారు. అప్పట్లోనే రూ.900 జీతం. కానీ నేను మాత్రం జాబ్ చెయ్యను.. బిజినెస్ చేస్తానని అన్నానని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.