యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ NTR30 కోసం ప్రిపరేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెక్నీషియన్లను ఫైనల్ చేసి కథానాయికను ఓకే చేయనున్నారు. ఇంతకుముందు అలియా భట్ నటిస్తుందని గుసగుసలు వినిపించాయి. కానీ నిర్మాతలు దేనినీ అధికారికంగా కన్ఫామ్ చేయడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆలియా నటిస్తుందా లేదా? అన్న దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఆసక్తికరంగా ఎన్టీఆర్ 30 గురించి అడిగినప్పుడు అలియా భట్ కూడా అంతే గుంబనగా సమాధానం ఇస్తోంది.
ఇంతకుముందు ఓ మీడియా సమావేశంలో ఎన్టీఆర్ 30 గురించి అలియాను ముంబై విలేకరులు ప్రశ్నించగా.. దానికి క్రిప్టిక్ ఆన్సర్ చెప్పింది ఆలియా. ప్రస్తుతానికి ఏమీ ధృవీకరించలేనని ఇంకా ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యనే చేసింది. ఇటీవల ఒక మీడియా పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ ``ఇంకా చర్చల్లో ఉన్నాను. నేను ఏదీ ధృవీకరించను. కానీ నేను ఎన్టీఆర్ తో మరొక చిత్రం చేయాలనుకుంటున్నాను. అతను చాలా ప్రతిభావంతుడు.. చాలా అద్భుతమైనవాడు.. పెద్ద స్టార్`` అని పొగిడేసింది.
కారణం ఏదైనా ఇరువైపుల నుంచి ఇంకా అధికారికంగా ఏదీ కన్ఫామ్ కావడం లేదు. ఎన్టీఆర్ 30 నిర్మాతలు కానీ.. అలియా భట్ కానీ క్లారిటీ నివ్వలేదు. ఆలియానే నాయిక అని ప్రకటించేందుకు నిర్మాతలు పదే పదే ఆలోచిస్తున్నారు. నిజానికి ఆర్.ఆర్.ఆర్ విడుదలైతే కానీ ఏదీ క్లారిటీ ఇవ్వలేరని స్పష్ఠమవుతోంది. కానీ ఎన్టీఆర్ 30లో ఎన్టీఆర్ కి జోడీగా అలియా నటిస్తోందని ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అధికారిక ప్రకటన కోసమే అంతా ఎగ్జయిటింగ్ గా వెయిటింగ్.
మరోవైపు ఆలియాకు బాలీవుడ్ షెడ్యూల్స్ అసాధారణంగా ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ తో పాటు గంగూభాయి కతియావాడీ చిత్రం ప్రమోషన్స్ లోనూ ఆలియా పాల్గొంటోంది. మరోవైపు బ్రహ్మాస్త్ర ప్రచారానికి తనవంతు బాధ్యత తీసుకుంటోంది.