యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ సినీ రంగ ప్రవేశం చేసి 61 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా పలువురు ప్రముఖులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఆయనతో వర్క్ చేసిన ఎంతో మంది స్టార్స్ సూపర్ స్టార్స్ ఆయన గురించిన విషయాలను సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చాలా ఏళ్ల క్రితం కమల్ నటించిన అభయ్ సినిమాలో ఒక విభిన్నమైన యానిమేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ ను హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ క్వెంటిన్ టరాంటినో స్ఫూర్తి పొంది తన సినిమాలో అలాంటి తరహా సీన్ ను పెట్టాడు.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లిన సమయంలో అక్కడ టరాంటినో తో మాట్లాడటం జరిగింది. భారతీయ సినిమాల గురించి అనురాగ్ కశ్యప్ మరియు టరాంటినో మాట్లాడుకుంటున్న సమయంలో అభయ్ సినిమాలోని ఆ సీన్ ను చూసి స్ఫూర్తి పొంది తన సినిమాలో యానిమేషన్ సీన్ పెట్టానంటూ చెప్పాడట. ఈ విషయాన్ని చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ కు అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. ఒక హాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కమల్ హాసన్ మూవీ సీన్ ను కాపీ కొట్టాడంటే మన కమల్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇందుకే కమల్ హాసన్ ను యూనివర్శిల్ స్టార్ అంటారంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.