మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రీకరణ పూర్తి అయ్యిందంటూ ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగిసిందని ప్రకటించిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే గత కొన్ని రోజులుగా సస్పెన్స్ గా కొనసాగుతున్న సైరాలో స్వీటీ విషయంపై కూడా క్లారిటీ వచ్చినట్లే ఉంది.
సైరా చిత్రంలో అనుష్క నటిస్తుందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి లీక్ అయితే రాలేదు. అయితే తాజాగా అనుష్కకు గాయం అయ్యిందనే విషయం తెల్సిందే. ఆ గాయం సైరా కోసం చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. స్వీటీ సన్నిహితుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమెకు సైరా సెట్స్ లోనే గాయం అయ్యిందట.
సైరా చిత్రంలో అనుష్క పాత్ర ఏమై ఉంటుందనే విషయంపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ చిత్రంలో అనుష్క రోల్ ను సస్పెన్స్ గా పెట్టాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంలో అనుష్క ఉన్న విషయాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయడం లేదు. విడుదలకు ఒకటి రెండు వారాలుండగా అప్పుడు ఈ విషయాన్ని రివీల్ చేస్తారేమో చూడాలి.
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుండగా నిహారిక కూడా ఒక పాత్రను పోషిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో అనుష్క కూడా ఉండటంతో సినిమాకు మరింత క్రేజ్ పెరగనుంది.