మన్మథుడు 2 ఆగష్టు 9 వెనక కథ ఇదా?

Update: 2019-07-19 17:30 GMT
ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' ఆగష్టు 15 నుండి ఆగష్టు 30 వ తారీఖుకు వాయిదా పడిన విషయం తెలిసిందే.  'సాహో' భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ మార్పు కారణంగా పలు ఇతర సినిమాల రిలీజ్ డేట్లు ఒక్కసారి మారిపోయాయి.  శర్వానంద్ 'రణరంగం'.. అడివి శేష్ 'ఎవరు' వెంటనే ఆగష్టు 15 డేట్లు లాక్ చేసుకున్నారు.  అయితే ఇప్పుడు అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' సినిమా రిలీజ్ డేట్ ఒక హాట్ టాపిక్ గా మారింది.  

'మన్మథుడు 2' విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ఆగష్టు 9 గా ప్రకటించారు. 'సాహో' లాంటి క్రేజీ ప్రాజెక్టుకు వారం ముందుగా సినిమాను రిలీజ్ చేయడంపెద్ద రిస్క్ అనే సంగతి అందరికీ తెలుసు.   'సాహో' కు హిట్ టాక్ వస్తే సునామీలా మిగతా సినిమాలను కబళించే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఆ డేట్ వద్దని నాగార్జునకు చెప్పారట. అయితే నాగ్ మాత్రం అదే డేట్ ను లాక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  ఇప్పుడు ఏకంగా 'సాహో' డేట్  వాయిదా పడడంతో చాలామందిలో మెదులుతున్న అనుమానం ఏంటంటే నాగార్జునకు ఈ 'సాహో' వాయిదా వ్యవహారం ముందే తెలిసి ఉంటుందని.. అందుకే కాన్ఫిడెంట్ గా ఆగష్టు 9 వ తేదీని ఖరారు చేశారని అంటున్నారు.  ఎందుకంటే నాగార్జున బిజినెస్ స్కిల్స్ గురించి అందరికీ తెలుసు.. ఆయన ఇలాంటి విషయాల్లో కరెక్ట్ గా ఉంటారు. లేనిపోని పోటీలు పెట్టుకుని సినిమాకు నష్టం చేసుకునే వ్యక్తి కాదు. అందుకే 'సాహో' గుట్టు ముందే తెలిసి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పుడు మొదటి వారం యధావిధిగా 'మన్మథుడు 2' కు ఫ్రీన్ రన్  ఉంటుంది కానీ రెండో వారంలో 'సాహో' కు బదులుగా 'రణరంగం'.. 'ఎవరు' చిత్రాలతో పోటీ పడాల్సి ఉంటుంది.  'సాహో' తో పోలిస్తే ఇదేమీ అంత టఫ్ కాంపిటీషన్ కాకపోవచ్చు.

    

Tags:    

Similar News