F3 లో బ్లాస్ట్ అయ్యే కీల‌క పాయింట్ ఇదే

Update: 2022-04-07 03:30 GMT
భార్య‌లతో స‌రిగ‌మ‌ల్లో బోలెడంత నవ్వులు అల్ల‌రి సృష్టించ‌వ‌చ్చ‌ని నిరూపించారు ఎఫ్ 2 చిత్రంతో. ఈసారి ఈ సినిమాకి కొన‌సాగింపుగా వ‌స్తున్న ఎఫ్ 3 క‌థాంశం ఎలా ఉండ‌నుంది? అంటే అంత‌కుమించిన పాయింట్ నే అనీల్ రావిపూడి ఎంచుకున్నాడ‌ని తెలుస్తోంది.

స‌హ‌జంగానే మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం క‌థ‌లు డ‌బ్బు చుట్టూ తిరుగుతాయి. ఏదీ స‌రిగా స‌మ‌కూర‌దు. డ‌బ్బు లేనిదే ఏదీ లేదు! అనుకునే మెంటాలిటీ పుట్టేది మ‌ధ్య‌త‌ర‌గ‌తిలోనే. పేద దిగువ త‌ర‌గ‌తుల్లో ఫీలింగ్స్ ఆలోచ‌న‌ల‌తో పోల్చినా .. ధ‌నిక వ‌ర్గాల ఆలోచ‌న‌ను మైండ్ సెట్ ని ప‌రిశీలించినా అక్క‌డ క‌నిపించ‌నిది మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో క‌నిపిస్తుంది. డ‌బ్బు వెంట ప‌డే క్ర‌మంలో బోలెడ‌న్ని స‌రిగ‌మ‌లు ఉంటాయి. ఒడిదుడుకులు ఎత్తు ప‌ల్లాలు క‌ష్టాలు క‌ల్లోలాలు వివాదాలు ఇలా ఇన్నిటినీ యాడ‌ప్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్ 3లో వీట‌న్నిటినీ అనీల్ రావిపూడి చూపిస్తున్నాడ‌ని టాక్.

ఇది సీక్వెల్ క‌థ కాదు! అని అనీల్ రావిపూడి ఇంత‌కుముందే చెప్పారు. ఎఫ్ 3 క‌థాంశం పూర్తిగా నూత‌నంగా ఉంటుంది. కొత్త టింజ్ తో డ‌బుల్ కామెడీ డ‌బుల్ డోస్ తో ఉంటుంద‌ని వెల్ల‌డించారు. F3 అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం వేసవి సెలవుల సందర్భంగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

F3 లోనూ కామ‌న్ ఎలిమెంట్ తెలుగు మధ్యతరగతి మహిళలను టార్గెట్ చేయ‌డ‌మేన‌నేది తాజా గుస‌గుస‌. భార్యలు అత్తమామలపై దృష్టి సారించి అనిల్ ముందుగా F2 తో చ‌క్క‌ని ఆహ్లాద‌క‌ర‌మైన కామెడీ అందించి హిట్టు కొట్టాడు. F3లో అంత‌కుమించి ట్రీటిస్తాడ‌ట‌. అయితే ఈసారి అనిల్ మహిళలను టార్గెట్ చేయ‌డం కంటే.. అందుకు కార‌ణాల‌పై గురి పెట్టాడ‌ట‌.  చివరికి ఆడాళ్ల‌కు అనుకూలంగా సందేశం ఇవ్వనున్నాడు.

ఎఫ్ 3 మొత్తం కేవలం డబ్బు చుట్టూనే తిరుగుతుందని కథనాలు వస్తున్నాయి. లబ్బు డబ్బు పాట ఇప్పటికే హింట్ ఇవ్వగా.. మధ్యతరగతి కుటుంబాలు డబ్బుల వెంట పరుగెత్తితే ఏం జరుగుతుందనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ఆడాళ్ల‌పై సెటైర్లు వేయ‌డం స‌రికాదు కానీ.. దానికి కార‌ణాల‌పై వేస్తే త‌ప్పేమీ లేద‌ని అర్థం చేసుకోవాలి. ఈసారి అనిల్ మధ్యతరగతి డబ్బు మనస్తత్వాన్ని .. ధనవంతులు పేదలను ఎలా దోపిడి చేస్తారో కూడా తెర‌పై చూపిస్తార‌ట‌. అద్భుత న‌టీన‌టుల‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే నవ్వుల అల్లరిని సృష్టించే ఎలిమెంట్ ఇద‌న్న టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్- వరుణ్ తేజ్ పార్ట్ 1లో బ్లాస్ట్ అయ్యేలా బోలెడ‌న్ని న‌వ్వుల్ని పండించారు. వీరికి సునీల్ లాంటి క‌మెడియ‌న్ యాడైతే మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. గ్లామ‌ర్ కంటెంట్ లో తమన్నా - మెహ్రీన్ అద‌ర‌హో అనిపిస్తారు. ఎఫ్ 3 త‌ర్వాత కూడా  F4 - F5లను కూడా చేసే ఆలోచనలో ఉన్నారా లేదా? అన్న‌ది అనీల్ రావిపూడి అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఎఫ్ 3 స‌క్సెస్ ని బ‌ట్టి కొన‌సాగింపు ఉంటుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News