అనంతమైన ఆకాశం .. అలుపెరగని సముద్రం ఎప్పుడూ కొత్తగా అనిపిస్తుంటాయి. అలాగే వెండితెరపై ప్రేమ అనే కథాంశం కూడా ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో 'ఉప్పెన' అగ్రస్థానంలో నిలిచింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. వైష్ణవ్ తేజ్ .. కృతి శెట్టి నాయక నాయికాలుగా నటించిన ఈ సినిమాకి, బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాను గురించి తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
"కులం .. మతం .. అంతస్థు .. గౌరవం విషయాల్లో పై స్థాయిలో ఉన్న ఓ అమ్మాయిని, వాటన్నింటికి క్రింది స్థాయిలో ఉన్న ఓ కుర్రాడు ప్రేమిస్తే ఏమౌతుందనేదే ఈ సినిమా కథ. కులం .. మతం ... అంతస్థు .. ఎనలేని గౌరవం చాలా గొప్పవని నమ్మిన ఒక అమ్మాయి తండ్రి, వాటి కోసం .. మగాడిలా ఎదురొచ్చినవాడి మగతనాన్నే తీసేయగలిగినవాడిగా ఈ కథలో కనిపిస్తాడు. అలాంటి భయంకరమైన వ్యక్తి, సినిమా ముగిసే సమయానికి అన్నిటికంటే ప్రేమనే గొప్పదని తలవంచడమే ఈ కథ ఇతివృత్తం.
ఒక యువకుడి యొక్క పురుషత్వం పై విలన్ దాడి చేయడమనేది నేను ఇంతకుముందు ఏ సినిమాలోను చూడలేదు. అసలీ ఈ అంశాన్ని తీసుకోవడమనేది బుచ్చిబాబు ధైర్యంతో కూడిన సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి. అలాంటి నిర్ణయాన్ని తీసుకున్న బుచ్చిబాబుకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను. అంతస్థు తేడాతో అమ్మాయిని ప్రేమించడం కొత్త కాదు .. పురుషత్వంపై విలన్ దాడి చేయడమే ఈ సినిమాలోని కొత్త పాయింట్. కథ పాతదే అయినా కథనంలో కొత్తదనం చూపించడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడు" అని చెప్పుకొచ్చారు.