టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ లో 'సితార ఎంటర్టైన్మెంట్స్' ఒకటి. 'ప్రేమమ్' సినిమాతో స్టార్ట్ అయిన ఈ బ్యానర్ ఎనిమిదేళ్లలో ఈ స్థాయికి రావడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - బాబాయ్ కె రాధాకృష్ణ అని యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెబుతున్నారు. 'డీజే టిల్లు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
''ఏదైనా స్క్రిప్ట్ నచ్చితే ముందు బాబాయి దగ్గరికి పంపిస్తాను.. ఆయనకు కూడా నచ్చితే త్రివిక్రమ్ వద్దకు పంపిస్తాం.. ముగ్గురం ఓకే అనుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లాలని డిసైడ్ అయ్యాం. 'రణరంగం' వంటి మిస్టేక్స్ చేసిన తర్వాత ఇలాంటి ప్లానింగ్ తో వెళ్తున్నాం. తెలిసి తప్పులు చేయకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం'' అని నాగవంశీ చెప్పారు. 'డీజే టిల్లు' సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ సలహాతో కొన్ని బ్లాగ్స్ రీషూట్ చేసినట్లు తెలిపారు.
'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమా చూసి త్రివిక్రమ్ కు చెప్తే.. వెంటనే రీమేక్ రైట్స్ తీసుకోమని చెప్పారన్నారు. ఫ్లాట్ సేమ్ ఉన్నప్పటికీ.. ఒరిజినల్ లో లేని చాలా కొత్త కొత్త ఎలిమెంట్స్ 'భీమ్లా నాయక్' లో చూస్తారని.. పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని అన్నారు. దర్శకుడు సాగర్ కె చంద్ర అయినప్పటికీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ తో పాటుగా వెనకుండి అన్నీ తానై చూసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీనిపై ఎట్టకేలకు నాగవంశీ స్పందించారు.
'అజ్ఞాతవాసి' రూపంలో పవన్ కళ్యాణ్ కు ప్లాప్ ఇచ్చామని.. మళ్ళీ ఆ మిస్టేక్ జరగకూడదని త్రివిక్రమ్ ను 'భీమ్లా నాయక్' సినిమాలో ఇన్వాల్వ్ చేసినట్లు తెలిపారు. "పవన్ కల్యాణ్ విషయంలో మేం తప్పు చేశాం. తప్పు జరిగిపోయింది. ఆ తప్పు మళ్లీ రిపీట్ అవ్వకూడదనేదనే భయంతో బాధ్యతతోనే త్రివిక్రమ్ ను సెట్స్ లోకి రమ్మని మేం రిక్వెస్ట్ చేశాం. పవన్ కల్యాణ్ కు, ఆయన ఫ్యాన్స్ కు బాకీ ఉన్నాం. ఆ బాకీ తీర్చాల్సిందే" అని అన్నారు.
త్రివిక్రమ్ సెట్స్ లో ఉన్నప్పటికీ డైరెక్టర్ సాగర్ చంద్రనే అని.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని తేరా మీదకు తీసుకురావడం చాలా కష్టమని.. ఆ విషయంలో దర్శకుడిగా సాగర్ చంద్ర సక్సెస్ అయ్యాడని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు వస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి రిలీజ్ డేట్ ఉంటుందని.. అన్నీ కుదిరితే మహా శివరాత్రికి థియేటర్లలోకి తీసుకొస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయమని అడగాలని అన్నారు.
'డీజే టిల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'భీమ్లానాయక్' సినిమా విడుదల జగన్ చేతుల్లో ఉందని నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ.. ''కోవిడ్ పోయి సాధారణ స్థితికి వచ్చినప్పుడు.. ప్రభుత్వం అన్ని ఆంక్షలను తీసివేసినప్పుడు అందరూ హ్యాపీగా థియేటర్ కు వస్తారనే ఉద్దేశ్యంతో చెప్తే ఇంకో రకంగా ప్రోజెక్టు చేసారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనబోయి.. జగన్ గారు డెసిషన్ తీసుకోవాలి అన్నాను'' అని నాగవంశీ చెప్పుకొచ్చారు.