చిన్న సినిమాగా తెరకెక్కి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న 'జాతిరత్నాలు' రెండవ వారం కూడా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. ఈ సినిమా గొప్పగా ఉందని రివ్యూలు ఏమీ రాలేదు. సినిమా కథ సూపర్ గా ఏమీ లేదు. కాని ఎంటర్ టైన్ మెంట్ మాత్రం బాగుందనే టాక్ వచ్చింది. ఇలా ఎంటర్ టైన్ మెంట్ బాగుందని చాలా సినిమాలకు టాక్ వచ్చినా అవేవి ఇంతగా వసూళ్లను రాబట్టిన దాఖలాలు లేవు. కాని జాతి రత్నాలు సినిమా మాత్రం యావరేజ్ టాక్ తోనే 50 కోట్ల వసూళ్ల వైపుకు దూసుకు పోతుంది. ఇంత భారీ వసూళ్లకు ప్రధాన కారణం చిత్ర యూనిట్ సభ్యుల చిచోర్ ప్రచారం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హీరోయిన్ ఫరియా రైతు బజారుకు వెళ్లడం అక్కడ వారితో ఇంటారాక్ట్ అవ్వడం నుండి మొదలనుకుని ముంబయి వెళ్లి ప్రభాస్ ను కలిసి ట్రైలర్ లాంచ్ చేయించడం.. ప్రతి ఒక్క బుల్లి తెర షో లో జాతిరత్నాలు చేసిన సందడి ఇవన్ని కూడా సినిమా పై జనాల్లో ఆసక్తి కనబర్చేలా చేశారు. వీరు ఇక్కడే ఇంత ఎంటర్ టైన్ చేస్తే సినిమాలో మరెంతగా ఎంటర్ టైన్ చేసి ఉంటారో అని ప్రతి ఒక్కరు భావించారు. అన్ని రకాల మీడియాలను ఉపయోగించుకుని తమ సినిమా విడుదలకు వారం ముందు నుండే జనాల్లోకి వెళ్లేలా యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారు.
భారీ ఈవెంట్ లు నిర్వహించినంత మాత్రాన పబ్లిసిటీ రాదని జాతి రత్నాలు టీమ్ భావించింది. అందుకే హీరో నవీన్ పొలిశెట్టి మరియు హీరోయిన్ ఫరియాలతో పాటు రాహుల్ మరియు దర్శిలు రెండు మూడు వారాల పాటు కంటిన్యూగా ఏదో ఒక షో లో కనిపించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం జరుగుతూనే ఉంది. గత మూడు వారాలుగా యూట్యూబ్ లో జాతి రత్నాలు ప్రమోషనల్ వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి అంటే ఏ రేంజ్ లో వీరు ప్రమోషన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. జాతి రత్నాలు సక్సెస్ సీక్రెట్ ప్రమోషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.