నాలుగు నెలలకు ముందు అఖిల్ సార్థక్ అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాని ఇప్పుడు అఖిల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. కోట్లాది మందికి ఆయన సుపరిచితుడు అయ్యాడు అనడంలో సందేహం లేదు. ఈ సీజన్ ఎంతో మంది కొత్త వారిని ప్రేక్షకులకు పరిచయం చేసింది అనడంలో సందేహం లేదు. అఖిల్ ఈ సీజన్ లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అనే ట్యాగ్ తో అడుగు పెట్టాడు. తనదైన అటిట్యూడ్ తో అఖిల్ ఒక వర్గం వారిని ఆకట్టుకున్నాడు. మోనాల్ తో రొమాన్స్ వల్ల ఎక్కువ కాలం హౌస్ లో ఉన్నాడు అనే వాదన వినిపించినా కూడా అఖిల్ చాలా కష్టపడ్డాడు కనుక రన్నర్ గా నిలిచాడు అంటూ ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇక అఖిల్ బిగ్ బాస్ లో అడుగు పెట్టక ముందే బ్రేకప్ అనే విషయం తెల్సిందే.
తన బ్రేకప్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా కులం తక్కువది అని చెప్పి వెళ్లి పోవడం చాలా బాధ వేసింది. లవ్ బ్రేకప్ కు చాలా రీజన్లు ఉంటాయి. కాని నా లవ్ బ్రేకప్ కు నా కులం రీజన్ అవ్వడం దురదృష్టకరం అన్నాడు. అయినా కూడా నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈసారి ప్రేమించబోతున్న అమ్మాయికి నా కులం ముందే చెప్పి అభ్యంతరం లేకుంటేనే ప్రేమిస్తాను అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక మోనాల్ గురించి అఖిల్ ను ప్రశ్నించిన సమయంలో నాకు బిగ్ బాస్ ఒక మంచి స్నేహితురాలిని ఇచ్చాడు అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు. అఖిల్ ఒక వెబ్ సిరీస్ కు ఓకే చెప్పాడని తెలుస్తోంది. సంక్రాంతికి ముందే ఆ విషయాన్ని అధికారికంగా చెప్తాను అన్నాడు.