నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్' టాక్ షో ఓటీటీ స్పేస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో.. అశేష ప్రేక్షకాదరణ తెచ్చుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. సక్సెస్ ఫుల్ గా సాగిన బాలయ్య టాక్ షో మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ షో సక్సెస్ అవడం వెనుక ఆహా టీమ్ కృషి ఎంతో ఉంది.
డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేకత చాటుకునేలా ఓటీటీని నడుపుతున్న అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. ఎవరూ ఊహించని రీతిలో సీనియర్ హీరో బాలకృష్ణతో టాక్ షో చేయాలనే విభిన్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇదే విషయాన్ని వెంటనే బాలయ్యకు చెప్పడం.. ఆయన కూడా ఒప్పుకోవడంతో ‘అన్ స్టాపబుల్’ షోకు శ్రీకారం చుట్టారు.
బాలకృష్ణ టాక్ షో వెనుక అల్లు అరవింద్ కృషి ఎంత ఉందో.. టాలీవుడ్ డైరెక్టర్ బీవీఎస్ రవి - బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నందమూరి కష్టం కూడా అంతే ఉందని తెలుస్తోంది. 'వాంటెడ్' 'జవాన్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మచ్చ రవి.. ఎన్నో చిత్రాలకు కథ మాటలు అందించారు. ఇప్పుడు ఆయన ‘అన్ స్టాపబుల్’ షోకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
టాక్ షోకు వచ్చే గెస్టులను బట్టి స్క్రిప్ట్ రాసుకోవడం.. బాలయ్య అడిగే ప్రశ్నలను రెడీ చేయడం.. ఇద్దరు స్టార్స్ ని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేయడం కోసం రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి ఎంతో ప్రిపరేషన్ చేసేవారని తెలుస్తోంది. రవి ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ షోకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.
ఇందులో భాగంగా 'అన్ స్టాపబుల్' షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన తేజస్విని నందమూరి శ్రమ కూడా ఉందని బివిఎస్ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో హోస్టుగా తన తండ్రి బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని చెప్పారు. ఆహా టీమ్ తో కలిసి పనిచేస్తూ బాలకృష్ణ లుక్ మరియు కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, 'అన్ స్టాపబుల్' షో బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ మరింత మంది అభిమానులకు దగ్గర చేసింది. అలానే 'ఆహా' ఓటీటీని తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్న ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.