ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘2.ఓ’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం 600 కోట్ల బడ్జెట్ తో 3డి లో చిత్రీకరించారు. అత్యాధునిక టెక్నాలజీని వాడటంతో ఈ చిత్రాన్ని 3డి లో చూస్తే అద్బుతమైన ఫీలింగ్ కలుగుతుందని, తప్పకుండా ఈ చిత్రాన్ని 3డిలో చూడండి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి కూడా చెబుతూ వస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా రజినీకాంత్ మాట్లాడుతూ ఈ చిత్రం కథ 3డి కి బాగా సూట్ అవుతుంది. అందుకే దీన్ని 3డిలో శంకర్ చేద్దామన్నప్పుడు నేను కాదనలేదు. 3డిలో ఈ చిత్రంను చూసిన వారికి అద్బుతమైన అనుభవం దక్కుతుందని రజినీకాంత్ నమ్మకంగా చెప్పాడు.
3డి వర్షన్ అద్బుతంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి చెబుతున్నారు. సాదారణ ఏ యాక్షన్ మూవీ అయినా 3డిలో చూస్తే అద్బుతం అనిపిస్తుంది. ఇక ఇంతటి గ్రాఫిక్స్ మూవీని 3డిలో చూస్తూ ఎప్పటికి మర్చిపోలేని అనుభూతి దక్కుతుంది. ఇదంతా సరే కాని మరి 2డి పరిస్థితి ఏంటా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొదటి నుండి కూడా 3డి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇండియాలో 3డి కంటే 2డి థియేటర్లు ఎక్కువ, 3డి చూసే వారి కంటే 2డి చూసే వారే అత్యధికం. మరి ఈ చిత్రం 3డికి అనుగుణంగా ఉండి, 2డిలో ఆకట్టుకోలేక పోతే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
3డిలో అందరు చూడలేనప్పుడు ఇంత ఖర్చు పెట్టి 3డిలో తెరకెక్కించడం ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ట్రైలర్ విషయంలోనే 3డి - 2డి ల్లో తేడా అనిపించింది. ట్రైలర్ ను 3డి థియేటర్ లో ప్రత్యేక స్క్రీనింగ్ చేసిన విషయం తెల్సిందే. 3డిలో చూసిన వారు అద్బుతం అన్నారు. అదే 2డిలో చూసిన వారు జస్ట్ ఓకే అన్నారు. ట్రైలర్ విషయంలోనే అలా జరిగినప్పుడు సినిమా విషయంలో అదే పునరావృతం జరగదని నమ్మకం లేదు. 2డిలో కనుక ఈ చిత్రం కాస్త అటు ఇటు టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ కు భారీగా గండి పడే అవకాశం ఉందనిపిస్తుంది. 3డి టాక్ ఏమో కాని 2డి టాక్ ఎలా ఉంటుందా అని సినీ విశ్లేషకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.