గత కొంతకాలంగా `మహర్షి` ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి.. నిర్మాణ భాగస్వాముల మధ్య విభేదాల గురించి తామరతంపరగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దత్ తో దిల్ రాజు- పీవీపీ జోడీకి విభేధాలు అంటూ ప్రముఖంగా చర్చ సాగింది. అయితే అన్నిటినీ పరిష్కరించుకుని తిరిగి ఆ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించి విమర్శలకు చెక్ పెట్టేయడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. నిన్నటి సాయంత్రం `మహర్షి` ప్రిలీజ్ వేడుకలో ఒకే వరుసలో పక్కపక్కనే కూచున్న ఆ ముగ్గురూ .. వేదికపైనా ఒకరినొకరు పొగిడేసుకోవడం చర్చకు వచ్చింది.
`మహర్షి` ప్రీరిలీజ్ వేదికపై నిర్మాత సి.అశ్వినీదత్ మాట్లాడుతూ - ``మహేష్ 25వ చిత్రాన్ని మేం ముగ్గురు భాగస్వాములం నిర్మించడం ఆనందంగా ఉంది. గతంలో నా సహచర నిర్మాతలు అల్లు అరవింద్ గారితో - రాఘవేంద్రరావుగారితో కలిసి సినిమాలు చేశాను. ఈ తరంలో యంగ్ అండ్ డైనమిక్ టాలెంటెడ్ నిర్మాతలు దిల్ రాజు- పివిపితో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది`` అని నొక్కి చెప్పారు. మే 9న గతంలో నేను నిర్మించిన జగదేకవీరుడు అతిలోక సుందరి.. మహానటి చిత్రాలు రిలీజై ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. మహర్షి టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ అభిమానులకు థాంక్స్. `అగ్ని పర్వతం` చిత్రం నుండి ఘట్టమనేని కుటుంబంతో ఎన్నో గొప్ప చిత్రాలు తీశాను. అలాగే రాజకుమారుడు చిత్రంలో మహేష్ ను ప్రిన్స్ గా హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేశానని ఈ సందర్భంగా దత్ ప్రస్థావించడం ఆసక్తికరం.
ఇదే వేదికపై దిల్ రాజు... పీవీపీ సైతం అన్ని కలతల్ని మర్చిపోయి సహచరుడు అయిన అశ్వనిదత్ గురించి ప్రస్థావించారు. స్పీచ్ లో దత్ గారు..! అంటూ నొక్కి పలికారు. ఓవరాల్ గా వివాదాలు సమసి ఈ త్రయం ఓ రికార్డ్ బ్రేకింగ్ సినిమాని ఘట్టమనేని అభిమానులకు.. తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారనే అంతా భావిస్తున్నారు. మే 9న అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అంతవరకూ వేచి చూడాల్సిందే.