'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ''మిషన్ ఇంపాజిబుల్''. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్న సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.
''మిషన్ ఇంపాజిబుల్'' (Mishan Impossible) మూవీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. 2022 ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆసక్తిని కలిగించాయి.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ చాలా ఆహ్లాదకరంగా రిఫ్రెష్ గా ఉంది.. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని మహేష్ ట్వీట్ చేశారు.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అయిన తాప్సీ.. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు - ప్రభావం మరియు బెయిల్ గురించి చెప్తుండంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అయితే ఆమె తలపెట్టిన మిషన్ దాదాపు అసాధ్యమని భావించినప్పుడు.. దాన్ని పూర్తి చేయడం కోసం ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటుంది.
రఘుపతి రాఘవ రాజారాం అనే ముగ్గురు పిల్లలు తమకు అసాధ్యమైనది ఏమీ లేదని భావిస్తున్నారు. వారు తక్కువ సమయంలో ధనవంతులు కావడానికి భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాప్సీ కూడా వారి ధైర్యాన్ని మెచ్చుకుంటోంది. అయితే వాళ్ళు ఈ మిషన్ ను ఎలా పూర్తి చేస్తారు అనేది కథలో కీలకాంశం.
స్వరూప్ తన అద్భుతమైన రచన మరియు టేకింగ్ తో నమ్మశక్యం కాని నిజమైన సంఘటన ఆధారంగా 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రాన్ని రూపొందించారని అర్థం అవుతోంది. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వంటి అన్ని కమర్షియల్ హంగులు కలబోసిన కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
తాప్సీతో పాటుగా ముగ్గురు పిల్లలు తమ ఉల్లాసమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇందులో హరీశ్ పేరడీ - హర్ష్ రోషన్ - భాను ప్రక్షన్ - జయతీర్థ - సత్యం రాజేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా.. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
'మిషన్ ఇంపాజిబుల్' చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి లు నిర్మించారు. ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రవితేజ గిరిజాల ఎడిటర్ గా.. నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి వస్తున్న 'మిషాన్ ఇంపాజిబుల్' చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Full View