'రాధేశ్యామ్'కు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు.. ప్రకటించిన నిర్మాతలు!

Update: 2021-02-11 16:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'రాధే శ్యామ్'. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో.. అంతకన్నా ఎక్కువగా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. పలుమార్లు పోస్ట్ పోన్ అయిన ఈ మూవీ టీజర్.. ఎట్టకేలకు వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రాబోతోందని అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ టైమ్ లోనే మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రభాస్ లాస్ట్ మూవీ 'సాహో' పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది. ఆ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు సంగీత సారథ్యం వహించారు. అయితే.. సౌత్ లో ఈ ఆల్బం అంతగా క్లిక్ కాలేదు. 'సాహో' మ్యూజిక్ మొత్తం బాలీవుడ్ స్టఫ్ తో నిండిపోయినట్టుగానే అనిపించింది. చివరకు టాలీవుడ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంతగా కనెక్ట్ కాలేకపోయారు. దీంతో.. ఈ ఎక్స్ పీరియన్స్ నుంచి పాఠం నేర్చుకున్న మేకర్స్.. మరోసారి ఆ రిజల్ట్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

'రాధేశ్యామ్' విషయంలో ఆ పొరపాటు జరగకూడదని నిర్ణయించుకున్న నిర్మాతలు.. ఓ ఇంట్రస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేమంటే.. ఈ చిత్రానికి గానూ బాలీవుడ్ కు వేరుగా, సౌత్ ఇండస్ట్రీకి వేరుగా మ్యూజిక్ డైరెక్టర్లను అపాయింట్ చేశారు! ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది యువి క్రియేషన్స్.

బాలీవుడ్ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు.. సౌత్ కోసం ఒకరిని ఎంచుకున్నారు. హిందీ వెర్షన్ కు సంబంధించి మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన సౌత్ ఇండస్ట్రీకి మ్యూజిక్ సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్ కు అప్పగించారు. వీరిలో జస్టిన్ ను గతంలోనే తీసుకున్న విషయం తెలిసిందే.

కొత్త సంగీత దర్శకులకు గ్రాండ్ గా వెల్కం చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు యువి మేకర్స్. 'మీ మెలోడీ మ్యూజిక్ కోసం మేమిక వెయిట్ చేయలేకపోతున్నాం..' అంటూ ఆహ్వానించారు నిర్మాతలు. కాగా.. ఈ నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

నార్త్, సౌత్ సినీ ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా వరకు తేడాలుంటాయి. వారి టేస్ట్ కు తగ్గట్టుగా మ్యూజిక్ అందించాలంటే.. అక్కడి వారైతేనే బాగుంటుందని, ఆ విధంగా మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకోవడం అభినందనీయమని అంటున్నారు నెటిజన్లు. మరి, వీరు ఎలాంటి ఆల్బమ్ ను అందిస్తారో చూడాలి.
Tags:    

Similar News