దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ను ఇచ్చిన శ్రీను వైట్ల అంతకు ముందు కూడా వరుసగా పెద్ద ఎత్తున సక్సెస్ లను దక్కించుకున్నాడు. దూకుడు వచ్చి పదేళ్లు అయ్యింది. ఆ తర్వాత అయిదు సినిమాలు చేశాడు. అందులో బాద్ షా కాస్త పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత వచ్చిన ఆగడు.. బ్రూస్ లీ.. మిస్టర్ మరియు అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. పదేళ్లుగా శ్రీను వైట్ల సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా ఈయన ఇంకా చాలా నమ్మకంతో సినిమాలు చేస్తూ ఉన్నాడు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది.
ప్రస్తుతం ఈయన దర్శకత్వం లో మంచు విష్ణు హీరోగా ఢీ అండ్ ఢీ సినిమా రూపొందుతోంది. వీరి కాంబోలో గతంలో వచ్చిన ఢీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కనుక ఈ సినిమా పై ఆసక్తి ఉంది. కొందరు మాత్రం శ్రీను వైట్ల గత సినిమాల ఫలితాల నేపథ్యంలో మంచు విష్ణు గత చిత్రాల ఫలితాల కారణంగా ఆసక్తి చూపించడం లేదు. ఢీ అండ్ ఢీ సినిమా చిత్రీకరణ జరుగుతున్న ఈ సమయంలోనే కరోనా వల్ల వాయిదా వేయడం జరిగింది. ఆ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల గ్యాప్ రావడంతో శ్రీను వైట్ల మూడు కథలను సిద్దం చేసుకున్నాడట. మూడు కూడా మంచి కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ కమ్ కామెడీ స్క్రిప్ట్ లుగా చెబుతున్నాడు.
వరుసగా ఆ సినిమా లను చేయబోతున్నట్లుగా చెప్పాడు. ఈ సమయంలోనే ఆయన ఒక సెంటిమెంట్ ను చెబుతున్నాడు. కెరీర్ ఆరంభంలో ఈయన అందరి వాడు తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఢీ.. దుబాయ్ శ్రీను మరియు రెడీ సినిమాలను చేసి సక్సెస్ లను దక్కించుకున్నాడు. ఈసారి కూడా రెండు ఏళ్ల గ్యాప్ వచ్చింది కనుక ఖచ్చితంగా మరో విజయాన్ని సొంతం చేసుకుంటాను అనే నమ్మకంతో శ్రీను వైట్ల ఉన్నాడు.
వైట్ల కథలు రెడీ గా ఉన్నంత మాత్రాన హీరోలు సిద్దంగా ఉన్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న ఢీ అండ్ ఢీ సినిమా ఫలితంను బట్టి ఆయనతో సినిమా ను చేసేందుకు హీరోలు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే అయిదు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు చవి చూసిన వైట్లకు ఈ సినిమా అయినా సక్సెస్ అయితే మళ్లీ కొన్నాళ్ల పాటు కెరీర్ లో బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమా కూడా నిరాశ పర్చితే ఆయన కెరీర్ లో వరుసగా అరడజను ప్లాప్ లే అంటూ ఆయన్ను హీరోలు కాని నిర్మాతలు కాని నమ్మే అవకాశం ఉండదని అందుకే తదుపరి సినిమాల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారు.
పైగా శ్రీనువైట్ల సొంతంగా రాసుకున్న కథలు నిరాశ పర్చాయి. కనుక ఈ కథల తో సినిమా లు చేయాలంటే ఆ హీరోలు చాలా డేర్ చేయాల్సి ఉంటుంది. మరి అంతగా డేర్ చేసే హీరోలు ఉన్నారా అంటే అనుమానమే అనిపిస్తుంది. ఒక వేళ ఢీ అండ్ ఢీ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా కొందరు హీరోలు అయినా ఆయనతో సినిమా లు చేసేందుకు సిద్దం అన్నట్లుగా ఉంటారు. మరి వైట్ల గారు ఢీ అండ్ ఢీ తో సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.