భారతదేశంలో కొన్ని రోజుల పాటు 'ఇంటోలరెన్స్' అంటూ మన సెలబ్రిటీలు పెద్ద చర్చకే తెరలేపారు. అసలు దేశంలో ఏం జరుగుతోంది అంటూ నానా హంగామా చేశారు. అయితే అలాంటి ధోరణే ఇప్పుడు దక్షణి భారతంలో జరుగుతోందా అనిపిస్తోంది. కాని ఇక్కడ రాజకీయ నాయకులు మరియు యంత్రాంగం కంటే కూడా.. ఫ్యాన్స్ అనే ఓ బ్యాచ్ నానా భీకరులుగా తయారవుతున్నారు. లక్షలమందిలో తప్పుగా బిహేవ్ చేసేది ఒకరే అయినా కూడా.. వారి వలన అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేయడం ఖాయం. పైగా వారి పనులను నిరసన కోసం చేసినవే అనడం ఇంకా దారుణం.
ఆ మద్యన రాహుల్ గాంధిపై ఎవరో చెప్పు విసరడానికి ప్రయత్నించారు. మొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ లో ఉన్నప్పుడు ఆయనపై కూడా చెప్పు విసిరే ప్రయత్నం ఒకటి జరగ్గా అది మిస్సయ్యి కారు బోనెట్ పై పడింది. ఇప్పుడు తమన్నా మీద కూడా ఒక అభిమాని చెప్పు విసిరాడు. ఆమె పక్కనే ఉన్న మరో వ్యక్తి అది తగిలింది. అదేదో ఆమె ముఖానికే తగిలి ఆమెకు గాయమైయుంటే? అసలు సెలబ్రిటీల మీదకు చెప్పులు వేయాల్సినంత తప్పులు వారేం చేశారని? అదిగో సినిమాలు మానేస్తోంది.. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయట్లేదు అంటూ తమన్నాపై చెప్పేసిన ప్రబుధ్దుడు వివరించాడు. అంటే సినిమాలు చేయకపోతే కొట్టేస్తారా? ఒకవేళ అదే విషయం ఆమెకు చెప్పాలని అనుకుంటే.. ఫేస్ బుక్లో ఆమెను ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టొచ్చు.. ట్వీట్ చేయొచ్చు.. ఒక వీడియో సందేశం తీసి యుట్యూబ్లో పెట్టొచ్చు.. ఒక ఓపెన్ లెటర్ రాని తుపాకి.కాం వంటి మీడియాకు అందించవచ్చు. అంతేకాని.. తనను పట్టించుకోవాలని చెప్పు వేసేస్తారా?
ఆ మద్యన ఓ ఫిలిం క్రిటిక్ పై కోడిగుడ్డేసిన అభిమానులు కూడా అటెన్షన్ కోసమే వేశాం.. అలా వేసినందుకేగా టివి ఛానల్లో మనల్ని లైవ్ కు పిలిచారు అని కాలర్ ఎగరేశారు. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించవచ్చు. ఒకటి.. అటెన్షన్ రావాలంటే తప్పే చేయాలి అనే భావన యువతలో వచ్చేసింది. దానికి సగం కారణం సరిగ్గాలేని వారి పెంపకం మరియు చదువులు అయితే.. రెండోది.. ఆ మిగతా సగం మీడియానే. పెంపకం అండ్ చదువుల గురించి ఉపన్యాసాలు ఇచ్చినోళ్లు కూడా రిటైర్ అయిపోతున్నారు కాని.. దానికి సొల్యుషన్ దొరకట్లేదు. ఇక మీడియా సంగతికి వస్తే.. తప్పు చేసినోడినే టివిల్లోకి పిలిచి.. మీ ఆవిడను ఎందుకు కొట్టావ్.. అసలు నువ్వు బూతు సినిమా ఎందుకు చేశావ్ అంటూ వీళ్లు కోర్టు తరహాలో జడ్జిమెంట్లు పాస్ చేస్తుంటే.. ఆడియన్స్ మాత్రం వారి తీర్పుకంటే కూడా.. తప్పు చేస్తేనే టివి డిబేట్లో కూర్చోపెడతారా అని ఆలోచించుకుని.. ఇలా చెప్పులు విసురుతున్నారు.
ఇలాంటి ప్రవర్తనను ఆదిలోనే కట్టడిచేయకపోతే.. అది ఉన్మాదంవైపు దారి తీసే ఛాన్సుంది. చెప్పో గుడ్డో వేస్తే క్రేజీ ఫ్యాన్ అంటారు కాని.. బాంబో బుల్లెట్టో విసిరితే మాత్రం తీవ్రవాదే అంటారు. కాబట్టి.. అలాంటి పనులు చేసేవారెవరైనా కూడా తమ పద్దతి మార్చుకుంటే బెటర్. లేకపోతే చివరకు అన్నీ కోల్పోయి.. ఒకటి నుండి ఏడు.. ఏడు నుండి ఒకటి కౌంటింగ్ చేసుకోవాల్సి వస్తుంది.. అదేనండీ ఊచలు!!
-లోకేష్ నాయుడు