6000 స్క్రీన్లలో తగ్స్ రచ్చ!

Update: 2018-11-03 11:42 GMT
బాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ గా వచ్చే గురువారం అంటే నవంబర్ 8న విడుదల కాబోతున్న తగ్స్ అఫ్ హిందుస్థాన్ మీద అంచనాలు మాములుగా లేవు. యాష్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీలో అమిర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ కాంబో ఉండటం ఇంత హైప్ కి కారణం అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ భారీ స్పందన దక్కించుకోగా నిర్మాణ సంస్థ యష్ ఫిలిమ్స్  సుమారు 6 వేల స్క్రీన్లలో కనివిని ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయబోతోంది. బడ్జెట్ తో పాటు బయ్యర్లకు రికవరీ కావడం కోసం టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కూడా యాష్ సంస్థ తెచ్చేసుకుంది.

దీని ప్రకారం 25 శాతం దాకా వీక్ ఎండ్ మొత్తం టికెట్ ధరలు ఉండబోతున్నాయి. ప్రాంతీయ మార్కెట్ కంటే నార్త్ లోనే ఇవి అమలు జరపబోతున్నారు. ముంబైలో అధికారిక ఆన్ లైన్ టికెట్ ధర కొన్ని స్క్రీన్లలో 1800 నుంచి 2 వేల రూపాయల దాకా ఉండటం అవి కూడా ఫాస్ట్ గా బుక్ అవుతూ ఉండటం పరిస్థితిని సూచిస్తోంది. మొదటి రోజు 70 కోట్ల నుంచి 100 కోట్ల దాకా వసూళ్లు ఆశిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. టాక్ పాజిటివ్ గా వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది కానీ ఏ మాత్రం తేడా వచ్చిన అంతకంతా బూమరాంగ్ లా రివర్స్ అవుతుంది.

రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన తగ్స్ అఫ్ హిందూస్తాన్ ని బాలీవుడ్ బాహుబలిగా వర్ణిస్తోంది అక్కడి మీడియా. దాన్ని బీట్ చేసే సినిమా హిందీలో లేకపోవడం ఒక లోటుగా భావిస్తున్న అక్కడి మేకర్స్ ఇది ఆ లోటు తీరుస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే కత్రినా కైఫ్ వీడియో సాంగ్ హల్చల్ చేస్తోంది. అమీర్ అమితాబ్ ల నట విశ్వరూపంతో పాటు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో మరిపిస్తుందనే అంచనాలో తగ్స్ అఫ్ హిందుస్థాన్ బాక్స్ ఆఫీస్ పరీక్షలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో మరోవారం కన్నా తక్కువ వ్యవధిలోనే తేలిపోతుంది
Tags:    

Similar News