తమన్నా ఎక్కువ డిమాండ్ చేసింది-నిర్మాత

Update: 2017-04-13 09:27 GMT
ఎప్పుడో 2014లో రిలీజైన సినిమా ‘క్వీన్’. ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని తహతహలాడిపోయాడు తమిళ నటుడు.. నిర్మాత త్యాగరాజన్. రెండేళ్ల కిందటే రీమేక్ రైట్స్ తీసుకుని అప్పట్నుంచి సన్నాహాలు చేస్తూ...నే ఉన్నాడు. ఐతే ఈ మధ్యే వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి.. తమన్నా కథానాయికగా తమిళ తెలుగు భాషల్లో సినిమాను పునర్నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఆ ప్రకటన తర్వాత ఏ అప్ డేట్ లేదు. ఈ మధ్య ఉన్నట్లుండి ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా వార్తలొచ్చాయి. స్వయంగా త్యాగరాజనే ఇప్పుడు ఈ సినిమాను ఆపేస్తున్నట్లు చెప్పాడు. అందుకే కారణమేంటో కూడా వెల్లడించాడు.

తమన్నా పారితోషకం చాలా ఎక్కువ డిమాండ్ చేయడమే ‘క్వీన్’ రీమేక్ ఆగిపోవడానికి కారణమని త్యాగరాజన్ చెప్పడం విశేషం. తమన్నా అడిగినంత ఇస్తే ఈ ప్రాజెక్టు వయబుల్ కాదని.. అందుకే ఆమెతో ఈ సినిమాను తెరకెక్కించలేక వెనక్కి తగ్గామని త్యాగరాజన్ చెప్పాడు. ప్రస్తుతానికి ఈ సినిమాను ఆపేస్తున్నామని.. సరైన హీరోయిన్ దొరికితే భవిష్యత్తులో మళ్లీ ప్రాజెక్టును పున:ప్రారంభించే అవకాశాలున్నాయని అతను చెప్పాడు. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ రెండు భాషల్లోనూ ఓ సినిమాలో లీడ్ రోల్ చేయాలంటే కొంచెం ఎక్కువే డిమాండ్ చేసి ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత ఆమె రేంజ్ పెరిగింది. ఆమెతో సినిమా తీయాలనుకున్నపుడే తన రెమ్యూనరేషన్ ఏంటో తెలుసుకుని.. డీల్ మాట్లాడుకుని సినిమా అనౌన్స్ చేయాల్సింది త్యాగరాజన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News