#టైగ‌ర్ 3 .. పాకిస్తానీ ISI ఏజెంట్ ని ఢీకొట్టే ఇండియ‌న్ డేర్ డెవిల్ హీరో స్టోరి

Update: 2021-05-31 15:30 GMT
టైగ‌ర్ సిరీస్ లో రెండు సినిమాలు రిలీజై సంచ‌ల‌న విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమా స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది. ఈసారి పార్ట్-3కి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వార్ రైట‌ర్ శ్రీ‌ధ‌ర్ రాఘ‌వ‌న్ తో క‌లిసి ఆదిత్య చోప్రా స్క్రిప్టును అందిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. మ‌నీష్ శ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైగ‌ర్ 3 గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలో యాక్షన్ ప్యాక్డ్  సినిమా. మొదటి షెడ్యూల్ ని సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ జంట‌పై ప్రారంభించారు. ఈ టీమ్ తో ఇమ్రాన్ హష్మి కూడా చేరారు. అత‌డు ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌ను పోషిస్తున్నారు. టైగర్ 3 లో ఐఎస్ఐ ఏజెంట్ పాత్రను ఇమ్రాన్ హ‌ష్మి పోషిస్తారు. ఇండియన్ టైగర్ అవినాష్ సింగ్ రాథోడ్ కు పాకిస్తాన్ నుంచి అత‌డు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థిగా తెర‌పై క‌నిపిస్తారు.

స‌ల్మాన్ వ‌ర్సెస్ ఇమ్రాన్ హ‌స్మి ఎపిసోడ్స్ ఆద్యంతం సినిమాలో ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని తెలిసింది. ఇందులో జోయాగా క‌త్రిన పాత్ర కూడా యాక్ష‌న్ ప్యాక్డ్ స్టంట్స్ తో అల‌రిస్తుంది. ఇటీవ‌ల‌ టైగ‌ర్ 3 ర‌చ‌యిత‌లు ఎవ‌రు? అన్న‌దానికి ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. జైదీప్ సాహ్ని నుండి మనీష్ శర్మ వరకు అనేక పేర్లు మీడియాలో ప్ర‌చార‌మ‌య్యాయి. కానీ  ఈ చిత్రానికి స్క్రిప్ట్ ను వై.ఆర్.ఎఫ్ అధినేత ఆదిత్య చోప్రాతో పాటు వార్ ఫేం శ్రీధర్ రాఘవన్ రాశారు. హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ బ్లాక్ బస్టర్ వార్ కి శ్రీ‌ధ‌ర్ రాఘ‌వ‌న్ ర‌చ‌యిత‌.

టైగ‌ర్ సిరీస్ ని శ్రీ‌ధ‌ర్ తో క‌లిసి ఆదిత్య చోప్రా ముందుకు న‌డిపిస్తార‌ని తెలిసింది. పార్ట్ 3 కి శ్రీ‌ధ‌ర్ రాఘ‌వ‌న్ అత్యంత కీల‌క‌మైన‌ స్క్రీన్ ప్లేని అభివృద్ధి చేశారు. టైగర్ 2018 నుండి క‌థా ర‌చ‌నా ప్ర‌క్రియ‌లో కొన‌సాగుతూనే ఉంది. వారు ఏక్ థా టైగర్ - టైగర్ జిందా హైలకు గొప్ప‌ ఫాలోయింగ్ ను ప‌రిశీలించాకే పార్ట్ 3ని రూపొందిస్తున్నారు. టైగర్ 3 మొదటి రెండు భాగాల్లానే ప్రభావవంతంగా తెర‌కెక్క‌నుంది.

బాలీవుడ్ అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటిగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్మాత ఆదిత్య చోప్రా ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేశారు.. ఇక ఈ మూవీని యూరోపియ‌న్ యూనియ‌న్ లో తెర‌కెక్కించాల్సి ఉండ‌గా.. య‌ష్ రాజ్ బృందం టైగర్ 3  మొత్తం సిబ్బందికి కూడా టీకాలు వేయిస్తున్నారు. తద్వారా వారు పనిని తిరిగి ప్రారంభించాల‌న్న‌ది ప్లాన్. 2022 లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
Tags:    

Similar News