ఎడ‌మొహం పెడ‌మొహం ఏంటిలా?

Update: 2019-05-23 15:06 GMT
ఏంటో కిల‌కిలా న‌వ్వుతూ.. గ‌ల‌గ‌లా మాట్లాడుతూ ఎంతో ఇదిగా క‌లిసిపోవాల్సిన ప్రేమ గువ్వ‌లు ఇలా ఎడ‌మొహం పెడ‌మొహం అంటూ ఎవ‌రికి వారు విడి విడిగా ఎవ‌రి దారిన వాళ్లు వెళ్లిపోతున్నారు. ప్రేమికుల మ‌ధ్య గిల్లిక‌జ్జాలు తిట్టుకోవ‌డాలు అల‌క‌లు ఇవ‌న్నీ మామూలే కానీ మ‌రీ వీళ్ల మ‌ధ్య అస‌లేం జ‌రుగుతోందో అర్థం కాని ప‌రిస్థితి. ఓవైపు ఎవ‌రి దారిన వారు వెళుతున్నా ఆ మొహాల్లో ఏదో చిరున‌వ్వు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అంటే అంత‌కంటే ముందే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రిగింది. అదేంటి?

బాలీవుడ్ హాట్ క‌పుల్ దిశా ప‌టానీ- టైగ‌ర్ ష్రాఫ్ వ్య‌వ‌హారం ఏమాత్రం క‌రెక్టుగా అనిపించ‌డం లేదు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటోంది ఈ జంట‌. అస‌లు ఇదివ‌ర‌కూ `నినువీడ‌ని నీడ‌ను నేను` అన్న తీరుగా క‌నిపించే దిశా ప‌టానీ గ‌త కొంత‌కాలంగా ప్రియుడిపై గుర్రుగా ఉంటోంద‌ని ప్రచారం సాగుతోంది. టైగ‌ర్ వేరొక భామ‌తో ప్రేమాయ‌ణంలో ఉన్నాడ‌ని దాంతో దిశా అత‌డి నుంచి దూరంగా ఉంటోంద‌ని ప్ర‌చార‌మైంది.

ఇంత ల‌వ్వాడుకున్నాక ఏదో ఒక అంద‌మైన క్ష‌ణం పెళ్లాడేసుకుంటార‌ని భావిస్తే ఇలా అప్పుడే దూర‌మైపోతే ఎలా అంటూ మాట్లాడుకున్నారు. కానీ ఇంత‌లోనే ఇలా డిన్న‌ర్ డేట్లు అంటూ ఎంతో క్యాజువ‌ల్ గా షికార్ కి వ‌చ్చి కెమెరా కంటికి చిక్కుతున్నారు. ప్ర‌స్తుతానికి తీరిక స‌మ‌యాల్లో ఇలా ఖ‌రీదైన బాంద్రా రెస్టారెంట్ల‌లో ఈ గువ్వ‌ల జంట డిన్న‌ర్లు.. లంచ్ డేట్ లు అంటూ షికార్లు చేస్తోంది. అది కేవ‌లం స్నేహం మాత్ర‌మేనా?   లేక ఇంకేదైనానా? అన్న‌ది ఇద్ద‌రూ చెప్ప‌డం లేదు ఓపెన్ గా. ఓపెన్ అయ్యే త‌రుణం వ‌చ్చే వ‌ర‌కూ ఆగి చూడాలేమో! కెరీర్ ప‌రంగా ప‌రిశీలిస్తే.. ఓవైపు టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` రిలీజై యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. త‌దుప‌రి హృతిక్ తో క‌లిసి య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న చిత్రంలో టైగ‌ర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆహాక‌ళ్యాణం ఫేం వాణీ క‌పూర్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ సిరీస్ `భాఘి 3`లో టైగ‌ర్ న‌టించనున్నాడు. ఆ చిత్రంలో దిశాకు చోటు ఉంటుందా లేదా? అన్న‌ది టైగ‌ర్ నే చెప్పాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి ఈ గువ్వ‌ల జంట మ‌ధ్య ఆఫ్ ద స్క్రీన్ రొమాన్స్ లో క‌ల‌త‌లేవైనా ఉన్నాయా అన్న‌ది ఆరా తీయాల్సి ఉంది.


Tags:    

Similar News