హృతిక్ - టైగ‌ర్ తో జాన్ ఎటాక్ 2 ప్లాన్?

Update: 2022-04-09 02:30 GMT
బాలీవుడ్ సింహ‌బ‌లుడు జాన్ అబ్రహాం న‌టించిన `ఎటాక్` బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైన సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ ముందు ఇంకేదీ నిల‌వ‌ద‌ని జాన్ అత‌డికి అర్థ‌మైంది. ఇక‌పోతే ఇటీవ‌ల జాన్ భాయ్ చేసిన ఓ కామెంట్ నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తాను హిందీ న‌టుడిని అని సౌత్ లో అస్స‌లు న‌టించ‌న‌ని అన్నాడు.

మ‌రోవైపు ఎటాక్ ఫ్లాప్ అయ్యింద‌ని అంగీక‌రిస్తూనే అత‌డు త‌దుప‌రి ఓ హాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ గురించి ప్ర‌స్థావించాడు. అలాగే ఎటాక్ 2 తీస్తే అందులో త‌న‌తో పాటు వార్ స్టార్లు హృతిక్ - టైగ‌ర్ ష్రాఫ్ న‌టించాల‌ని కోరుకున్నాడు. అలాగే హాలీవుడ్  బంప‌ర్ హిట్ `ఓషన్స్ 11` రీమేక్ లో న‌టిస్తాన‌ని అత‌డు అన్నాడు. తాను ఇందులో బ్రాడ్ పిట్ పాత్ర‌లో న‌టిస్తాన‌ని అక్షయ్ కుమార్ తన జార్జ్ క్లూనీ కాగా.. టైగర్ ష్రాఫ్ అతని మాట్ డామన్ గా ఉండాలని కోరుకుంటున్నాడు.

తాజా చాటింగులో జాన్ పరిశ్రమలో వోన్ స్పేస్ ని సృష్టించడం గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు పోటీప‌డ‌కుండా ఎలా సహకరించుకోవాలి? అనే దాని గురించి మాట్లాడారు. ఇండ‌స్ట్రీలో నటులు ఒకరినొకరు దాచేసుకోవడం స‌రికాద‌న్నాడు. దానికి హాలీవుడ్ చిత్రం `ఓషన్స్ ఎలెవెన్` చిత్రం నుండి ఉదాహరణను ఇచ్చాడు. అత‌డు త‌న‌ని తాను బ్రాడ్ పిట్ తో పోల్చుకున్నాడు.

లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఎటాక్ లో జాన్ భాయ్ తో పాటు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్- రకుల్ ప్రీత్ సింగ్ - ప్రకాష్ రాజ్ - రత్న పాఠక్ షా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఇందులో యాక్షన్ సన్నివేశాలను మెచ్చుకున్నారు. సీక్వెల్ ప్ర‌స్తుతం అభివృద్ధి ద‌శ‌లో ఉంది.

ఎటాక్ స్టార్ జాన్ అబ్రహం ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానెల్ చాటింగులో కనిపించాడు. అక్కడ తార‌లు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని కూడా జాన్ అబ్ర‌హాం కోరాడు. అతను సినిమాలలో ఒకరినొకరు కప్పిపుచ్చుకునే నటుల గురించి మాట్లాడాడు. మరోవైపు ప్రతి చిత్రం తర్వాత విమర్శకుల‌ గురించి కూడా అతను గుర్తుచేసుకున్నాడు. వారిలో కొందరు తనను రచయితగా పని చేయమని అడిగారని జాన్ అబ్ర‌హాం పేర్కొన్నాడు.
Tags:    

Similar News