ఫేమస్ హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన 1982 యాక్షన్ చిత్రం ర్యాంబో ఇండియన్ వెర్షన్ రీమేక్ లో టైగర్ ష్రాఫ్ నటించనున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే హిందీ రీమేక్ ని అధికారికంగా ప్రకటించి మూడేళ్లు అయిపోవడంతో అసలు ఈ సినిమా ఉందా లేదా? అన్న సందిగ్ధత వ్యక్తమైంది.
అదే క్రమంలో ర్యాంబో రీమేక్ కోసం మేకర్స్ బాహుబలి ప్రభాస్ ని సంప్రదించారని త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని సోషల్ మీడియాల్లో ప్రచారమవుతోంది. అయితే దీనిపై టైగర్ స్పందించారు. ఇలాంటి చెత్త పుకార్లు ఎలా స్ప్రెడ్ అవుతాయో కానీ.. అంటూ ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మూడేళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభమైందని టైగర్ తెలిపారు.
అయినా మార్షల్ ఆర్ట్స్ అంటే భారతదేశంలో హృతిక్ .. టైగర్ ష్రాఫ్ లాంటి వారినే అభిమానులు ముందుగా ఊహించుకుంటారు. ఇటీవలి కాలంలో టైగర్ ష్రాఫ్ ప్రతిభ పనితనంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడు మరో ర్యాంబో అని ప్రశంసిస్తున్నారు. వార్ చిత్రంలో అతడి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ కి స్పెల్ బౌండ్ అయిపోయారు ఆడియెన్. టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్ ఔత్సాహికుడు. తైక్వాండోలో ఐదవ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించాడు. మార్షల్ ఆర్టిస్ట్-నటుడు బ్రూస్ లీని తన రోల్ మోడల్ గా చూస్తాడు. అలాంటి స్టార్ ని కాదని ప్రభాస్ కి అవకాశం ఇచ్చారనడం సహేతుకం కాదనేది నెటిజనుల్లో డిబేట్.
ఈ ప్రచారనికి టైగర్ అభిమానులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ర్యాంబో అంటే ఊపిరాడనివ్వని కిక్ లు పంచ్ లతో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఆద్యంతం మెరుపులు మెరిపించాలి. అందుకే రాంబో రీమేక్ టైగర్ కి మాత్రమే సాధ్యమనేది అతడి అభిమానుల భావన.
2017 లో హిందీ రీమేక్ ని ప్రకటించగానే.. దిగ్గజ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ఆ వార్తలపై ఇన్ స్టాలో స్పందించారు. ``నేను ఇటీవల ఈ వార్త చదివాను. భారతదేశంలో రాంబోను రీమేక్ చేస్తున్నారు!! .. గొప్ప పాత్ర .. వారు దానిని నాశనం చేయరని ఆశిస్తున్నాను``అని అన్నారు. అయితే దానికి టైగర్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తూ స్టాలోన్ పై కౌంటర్లతో విరుచుకుపడ్డారు.``కొంతమంది మాటల్లో ట్విస్ట్ చేయడం ఇష్టపడతారు .. టైగర్ మంచి పోరాటాలతో అదరగొట్టండి.. పంచ్ లు విసరండి.. రికార్డ్ కోసం .. నేను రాంబో ఆస్తిని నియంత్రించను.. కంపెనీ `మిలీనియం` లక్ష్యాన్ని చేరుతుంది! ఈ సంస్థ ఎక్స్‌పెండబుల్స్ ను కలిగి ఉంది. దానితో కూడా అదృష్టం`` అంటూ స్టాలోన్ మరోసారి టైగర్ అభిమానులకు వివరణ ఇచ్చారు.