డబూ రత్నాని క్యాలెండర్ షూట్ లో టైగర్ స్టైలిష్ లుక్..!

Update: 2021-06-22 15:08 GMT
ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని ప్రతీ ఏడాది పాపులర్ స్టార్‌ హీరోహీరోయిన్లతో కాలెండర్‌ షూట్‌ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు 2021 క్యాలెండర్‌ తో ముందుకు వచ్చారు డబూ రత్నాని. ఇందులో అలియా భట్ - సైఫ్ అలీఖాన్ - తారా సుతారియా - అభిషేక్ బచ్చన్ - అనన్య పాండే - విద్యా బాలన్ - విక్కీ కౌషల్ - సన్నీ లియోన్ - టైగర్ ష్రాఫ్ తదితరులు ఉన్నారు. సౌత్ నుంచి విజయ్ దేవరకొండ కు చోటు కల్పించారు. తాజాగా టైగర్ ష్రాఫ్ ఇన్‌స్టాగ్రామ్‌ లో డబ్బూ రత్నాని క్లిక్ చేసిన ఓ ఫోటోని షేర్ చేశారు.

టైగర్ ష్రాఫ్ ఈ ఫొటోలో తన రెండు చేతులను చాపి అబ్స్ ను చూపిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ కనిపించేలా బ్లాక్ షర్ట్ మరియు బ్లాక్ జీన్స్ ధరించి స్టైల్ గా కనిపిస్తున్నాడు. దీనికి డబ్బూ మరింత ఆకట్టుకునేలా రెయిన్ ఎఫెక్ట్‌ ను జోడించాడు. టైగర్ ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ.. ''డబూ రత్నాని వర్షాకాలం ముందు వర్షం పడేలా చేసాడు. మరో ఫాస్ట్ సరదా షూట్ చేసినందుకు ధన్యవాదాలు'' అని క్యాప్షన్ పెట్టాడు.

ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగు రీమేక్ సినిమాలతో టైగర్ ష్రాఫ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పరుగు' రీమేక్ ''హీరోపంతి'' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన టైగర్.. 'భాగీ' ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సౌత్ చిత్రాలను రీమేక్ చేసాడు. 'భాగీ' (వర్షం) - 'భాగీ 2'(క్షణం) - 'భాగీ 3' (వేట్టై - తెలుగులో 'తడాఖా') చిత్రాలతో సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో 'భాగీ 4' సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కృతి సనన్ తో కలసి ‘గణపథ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే 'హీరోపంతి 2' - 'రాంబో' హిందీ రీమేక్ చిత్రాలలో టైగర్ నటించనున్నాడు.
Tags:    

Similar News