బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్.. యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన 'వార్' సినిమా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. వార్ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయంటూ బాలీవుడ్ ప్రేక్షకులు సినిమా కు భారీ వసూళ్లను కట్టబెట్టారు. కేవలం హిందీలోనే కాకుండా వేరే భాషల్లో కూడా వార్ విడుదల అయ్యి మంచి టాక్ ను దక్కించుకోవడంతో పాటు భారీగా వసూళ్లను నమోదు చేసింది. వార్ సినిమా థియేటర్లు.. ఓటీటీ.. శాటిలైట్ ఇలా అన్ని ప్లాట్ ఫామ్ ల మీద కూడా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సీక్వెల్ ను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
సీక్వెల్ స్టోరీ సెట్ అయితే హృతిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించేందుకు సిద్దంగా ఉన్నాడట. కాని వార్ సినిమా లో టైగర్ ష్రాఫ్ పాత్ర చనిపోయినట్లుగా చూపించారు. సీక్వెల్ కోసం చనిపోయిన పాత్రను తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చనిపోయిన పాత్రను మళ్లీ తీసుకు వస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అంటే అనుమానమే. కాని మొదటి పార్ట్ లో ఆ పాత్ర చనిపోయినట్లుగా చూపించినా ట్విస్ట్ ఏంటీ అంటే ఆ పాత్ర చనిపోలేదు అని ప్రేక్షకులను కన్విన్స్ అయ్యేలా స్క్రీన్ ప్లేను నడపాలి. అలా నడిపినట్లయితే అప్పుడు ఆ పాత్ర తిరిగి వచ్చినా పెద్దగా విమర్శలు ఉండవు. అందుకే ఆ దిశగా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2022 లేదా 23 లో వార్ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.