మొత్తానికి సల్మాన్ ఖాన్ మళ్లీ పూర్వపు ఫామ్ లోకి వచ్చేశాడు. ‘ట్యూబ్ లైట్’తో కంగుతిన్న ఈ సూపర్ స్టార్.. ఇప్పుడు ‘టైగర్ జిందా హై’తో మళ్లీ తన బాక్సాఫీస్ పవర్ చూపిస్తున్నాడు. ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల కంటే మిన్నగా ఆదివారం ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో ‘టైగర్’ జిందా హై ఇండియా వసూళ్లు రూ.150 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర నాలుగు రోజుల వసూళ్లు రూ.247 కావడం విశేషం. తొలి మూడు రోజుల్లో మాదిరే క్రిస్మస్ రోజు కూడా ఈ చిత్రం భారీ వసూళ్లే రాబట్టింది. ఐదో రోజు సెలవు కాకపోయినా వసూళ్లు నిలకడగానే ఉన్నట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
సల్మాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘భజరంగి భాయిజాన్’ రూ.626 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘సుల్తాన్’ కూడా రూ.600 కోట్ల మార్కును అందుకుంది. ఇప్పుడున్న ఊపులో చూస్తే.. ‘టైగర్ జిందా హై’ కలెక్షన్లు ఈ రెంటినీ దాటేసే అవకాశాలున్నాయి. రెండో వారాంతంలో కూడా సల్మాన్ సినిమా జోరు కొనసాగించే అవకాశముంది. ఇయర్ ఎండింగ్ హంగామాలో భాగంగా ఈ చిత్రానికి మంచి వసూళ్లే రావచ్చు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో సల్మాన్ చేసిన ‘ఏక్ థా టైగర్’కు ‘టైగర్ జిందా హై’ సీక్వెల్. తొలి చిత్రాన్ని కబీర్ ఖాన్ రూపొందిస్తే.. రెండో చిత్రాన్ని ‘సుల్తాన్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తీర్చిదిద్దాడు. ఈ చిత్రంలో సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ కథానాయికగా నటించింది.