మన దగ్గర సినిమా వసూళ్ల కోసం షేర్ వసూళ్లను పరిగణిస్తారు. కొన్ని చోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను పరిగణిస్తారు. కానీ బాలీవుడ్ లో మాత్రం.. మొత్తం గ్రాస్ వసూళ్లలోంచి ఎంటర్టెయిన్మెంట్ సహా ఇతర(ఇప్పుడైతే జీఎస్టీ ఒక్కటేలే) పన్నులు మినహాయిస్తే లెక్కించే నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ లెక్కించడం ఆనవాయితీ.
ఎన్బీఓసీగా పరిగణించే ఈ కలెక్షన్స్ విషయంలో.. దేశం మొత్తంగా చూస్తే టాప్2 రికార్డులు బాహుబలి సిరీస్ పేరిటే ఉన్నాయి. కానీ బాలీవుడ్ వరకూ చూసుకుంటే మాత్రం.. ఇండియాలో ఇప్పటి వరకూ 300 కోట్ల నెట్ బాక్సాఫీస్ వసూళ్లను సాధించిన చిత్రాలు మరో నాలుగు ఉన్నాయి. దంగల్.. పీకే.. ఈ రెండు ఆమిర్ ఖాన్ సినిమాలు అయితే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మూవీస్ కూడా రెండు ఉన్నాయి. భజరంగీ భాయ్ జాన్.. సుల్తాన్ చిత్రాలు ఇప్పటివరకూ 300 కోట్ల నెట్ బాక్స్ ఆఫీస్ వసూళ్లను దాటిన కేటగిరిలో ఉన్నాయి. ఇప్పుడు సల్లూభాయ్ లేటెస్ట్ మూవీ టైగర్ జిందా హై కూడా ఈ క్లబ్బులో చేరిపోవడం ఖాయం అయిపోయింది. ఆల్రెడీ 272 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు అదే తరహాలో దూసుకుపోయి 300 మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తే.. ఇండియాలోనే 300 కోట్ల రూపాయల నెట్ బాక్స్ ఆఫీస్ వసూళ్లు సాధించిన చిత్రాలు 3 గల ఏకైక హీరో సల్మాన్ ఖాన్ మాత్రమే అవుతాడు.
అఫ్ కోర్స్.. ఇదేమీ చిరకాలం నిలిచిపోయే రికార్డ్ కాకపోయినా.. ఫస్ట్ ఎప్పుడూ ఫస్ట్ అవుతుంది కదా. ఇక నెట్ బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే.. బాహుబలి2 కేవలం హిందీ వెర్షన్ ఒక్కటే 500 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇప్పట్లో ఆ రికార్డును దాటడం కష్టమే.