తమిళ తంబీల టేస్ట్ కి తగ్గట్లే ఆ ఇండస్ట్రీలో దర్శకులు విభిన్నమైన సినిమాలు రూపొందిస్తూ ఉంటారు...అయితే కొత్త, పాత అని తేడా లేకుండా నూతన దర్శకులు కూడా సరికొత్త కధలతో సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటి సినిమాల్లో ఒకటైన 'రాక్షసన్'ని ఇప్పుడు మన తెలుగులోకి రీమేక్ చెయ్యనున్నాడు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ యువ హీరో తన సినిమాల పలితాలతో సంభందం లేకుండా...వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నాడు.
ఇక ఈరోజే రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాను నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తూ ఉండగా, హీరో కోనేరు హవీష్ సమర్పణలో సినిమా విడుదల కానుంది. ఇక సినిమాకి యువ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరో పక్క ఈ సినిమా కధ విషయానికి వస్తే, సినిమా అంటే ప్యాషన్ తో ఉండే హీరో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల పోలీస్ అవతారం ఎత్తవలసి వస్తుంది. ఇక ఆ పనిలో భాగంగా ఒక సైకొ కిల్లర్ కేసును డీల్ చెయ్యాల్సి వస్తుంది..ఆ కేసును హీరో ఎలా చేదించాడు, పోలీసుగానే చేదించాడా, లేక వ్యక్తిగతంగా ఈ కేసును డీల్ చేశాడా అన్న కోణంలో సాగే కధే ఈ సినిమా.
ఈ సినిమా తమిళంలో చిన్న సినిమాగా విడుదలయ్యి భారీ హిట్ ను అందుకుంది ఈ సినిమాలో...హీరోగా తమిళ హీరో విష్ణు విశాల్ నటించగా, హీరోయిన్ గా అందాల భామ అమలా పాల్ నటించింది. అయితే ఈ కధ బెల్లంకొండకు బాగా సూట్ అవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తాను నటిస్తున్న సీత సినిమా విడుదలకు సిద్దం కావడంతో గ్యాప్ లేకుండా వెంటనే ఈ రాక్షసన్ సినిమాను సెట్స్ పై తీసుకెళ్లనున్నాడు బెల్లంకొండ. మరి తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.