టైటిల్స్ విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. టీవీ డైరెక్టర్స్ సినిమా టైటిల్స్ కాపీ కొట్టేసినా ఫర్వాలేదు కానీ పెద్ద తెర దర్శకులు మాత్రం ఇలాంటి విషయాల్లో సిగపట్లు పట్టడం ఖాయం. ఇలాంటి వివాదాలు ఇప్పటివరకూ అన్ని పరిశ్రమల్లోనూ చూసాం. వ్యక్తుల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ని బట్టి కొన్నిసార్లు సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. తాజాగా సల్మాన్- ఆనంద్ ఎల్. రాయ్ మధ్య ఇలాంటి పరిష్కారమే ఒకటి కుదిరినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ..ధనుష్ హీరోలుగా...సారా అలీఖాన్ హీరోయిన్ `అట్రాంగిరే` అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా టైటిల్ ని ముందుగానే సల్మాన్ ఖాన్ రిజిస్టర్ చేయించారుట. `రక్షాబంధన్` టైటిల్ తో పాటు `అట్రాంగిరే` టైటిల్ ని స్వయంగా సల్మాన్ తన నిర్మాణ సంస్థ పేరిట రిజిస్టర్ చేయించారు. ఆనంద్ ఎల్ రాయ్ కంటే ముందుగానే సల్మాన్ ఈ పనిచేసాడు. దీంతో ఇదే టైటిల్ మళ్లీ ఛాంబర్ కి వెళ్లడంతో అక్కడ ప్రతినిధులు అడ్డు తగిలారుట. వెంటనే సల్మాన్ కి ఫోన్ చేయగా ఈ టైటిల్ తో సినిమా తీయాలనుకుంటే కేవలం ఆనంద్ ఎల్ రాయ్ మాత్రమే చేయాలని..అతనికి మాత్రమే ఇస్తానని అన్నారుట. లక్కీగా ఆ సినిమా చేసే దర్శకుడు కూడా ఆనంద్.ఎల్.రాయ్ కావడంతో టైటిల్ వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
మిగతా ఏ దర్శకుడు అయినా సరే సల్మాన్ ఆ టైటిల్ ఇచ్చే వారు కాదని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. లవ్ స్టోరీలను తెరకెక్కించడం లో ఆనంద్.ఎల్.రాయ్ ప్రత్యేకత కనిపిస్తుంది. `అట్రాంగిరే` సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతకంకు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.