సినిమా రంగమంటేనే ఒక మాయా ప్రపంచం. వెండితెరపైన వెలగాలని ఉవ్విళ్లూరే ఉత్సాహవంతులను ఈ మాయా ప్రపంచంలో బురిడి కొట్టించి జేబులు నింపుకొనే సినీమా..యగాళ్లకు కొదవేం లేదు. వీరి భారిన పడ్డ వారిలో ఇప్పుడు యువ స్టార్ నటుడు నిఖిల్ కూడా చేరారు. నటుడవ్వడానికి ఆయన ఓ సినిమాయ గాడికి 5 లక్షల రూపాయలు సమర్పించుకుని మోసపోయారట. మొత్తం కోటి రూపాయలు తెస్తే హీరో చేస్తామంటూ ఆయనకు ఆశ కూడా చూపించారట. తానెలా మోసపోయింది చెబుతూ స్వయంగా ఆయనే చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకుని దూసుకెళుతున్నారు. వైవిధ్యభరితమైన కథల సినిమాలను ఎంచుకుని హిట్లు కొడుతూ సక్సెస్ఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. కార్తికేయ సినిమా మంచి వసూళ్లు రాబట్టి ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఆయన 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా పరిశ్రమలో అడుగుపెట్టడానికి తొలినాళ్లలో ఆయన ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొంతమంది ఆడిషన్స్ పేరిట మోసాలు చేసేవారట. కోటి రూపాయలు తెస్తే హీరో చేస్తామని వాళ్లు చెప్పేవారట. కొందరు 50లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఇకరు ఆడిషన్స్ చేసి నటుడిగా ఎంపిక చేశామని చెప్పి నిఖిల్ నుంచీ రూ.5లక్షలు తీసుకున్నారట. చివకు ఆ సినిమా చిత్రీకరణకు కేవలం లక్ష ఖర్చు పెట్టేసి ఉడాయించేశారట.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన నేను తరువాత ఒక టీవీ సీరియల్లో కూడా నటించాను. అయితే ఇక్కడ ఉంటే బుల్లితెరకే పరిమితమవుతాను. సినిమాల్లో ట్రై చేద్దామని ప్రయత్నించాను. కొంతమంది ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వారిని సంప్రదించాను. వాళ్లు డబ్బులు డిమాండు చేయడం చూసి ఆశ్చర్యపోయాను అని ఆయన అన్నారు.
రూ.కోటి, రూ.50 లక్షలు కూడా డిమాండ్ చేసేవారు. ఒకతనికి రూ.5లక్షలు కూడా ఇచ్చా. కానీ తరువాత తెలిసింది ఇదంతా ఫేక్ అని అన్నారు. కానీ శేఖర్ కమ్ముల గారు చాలా జినైన్, నా యాక్టింగ్ నచ్చి నాకు అవకాశమిచ్చారు. అది నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ఇప్పపుడు ఆలోచిస్తే నేను వారి చేతుల్లో ఎలా మోసపోయానా అనిపిస్తుంటుంది అది అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.