పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ సమయంలోనే ముగుస్తుంది. హీరో ఇమేజ్ ఇండస్ర్టీలో ఇది సహజం. ఈ విషయంలో సమాన ప్రాతిపదిక కల్పించాలని కొంత మంది బాలీవుడ్ భామలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నా ఫలించలేదు. దీంతో కంగన లాంటి వారు సోలోగానే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. హీరోలకు తానేమి తీసిపోనంటూ...నిర్మాతలకు నాకిచ్చేదేంటి? నేనే ఓ వ్యవస్థను తయారు చేస్తానంటూ బాలీవుడ్ లో మును ముందుకు దూసుకుపోతుంది.
కంగనలా తెగింపుతో బయటకు రావాలని చాలా మంది హీరోయిన్ల మనసులో ఉన్నా? మొదటికే మోసం వస్తుందా? అని కొంత మంది భామలు అంతటి సాహసానికి పూనుకోలేకపోకపోతున్నారు. ఇది నెటి జనరేషన్ హీరోయిన్లలో ప్రధానంగా కనిపిస్తున్న వాస్తవం. ఒకప్పుడు సన్నివేశం ఇందుకు పూర్తి భిన్నం. హీరోలు రాజ్యమేలుతోన్న! మేమేం? వాళ్లకు తక్కువ కాదంటూ సత్తా చాటిన వెటరన్ భామా మణులు కొంతమంది ఉన్నారు.
ఓ వైపు గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తూనే హీరోలకు ధీటుగానూ సత్తా చాటిన నాయికలున్నారు. వాళ్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రమ్యకృష్ణ గురించి ముందుగా చెప్పాలి. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. అటుపై సహాయ పాత్రల్లోనూ మెప్పించారు. నీలాంబరిగా మెప్పించాలన్నా? శివగామిగా శాషించాలి అన్నా? అది రమ్యకృష్ణకి మాత్రమే సాధ్యమని ప్రూవ్ చేసారు.
`నరసింహ`లో రజనీకాంత్ పాత్రకి ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ఆద్యంతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నీలాంబరి పాత్ర ఆమె కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఆ బ్రాండ్ తో ఎన్నో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు చేసారు. అలాగే దివంగత నటి సౌందర్య కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ని శాషించారు. ఓవైపు హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియేంటెడ్ పాత్రలతోనూ మెప్పించారు.
కొన్ని నెగిటివ్ రోల్స్ సైతం సౌందర్యకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అలాగే వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన నటి రాశి. అప్పట్లో యువతని అందం..అభినయంతో ఓ ఊపు ఊపారు. రాశి సినిమా అంటే థియేటర్లకి జనాలు పరుగులు తీసేవారు. హీరోలతో రొమాంటిక్ చిత్రాలు చేస్తూనే నెగిటివ్ రోల్స్ తోనూ రాశి మెప్పించారు.
`నిజం` సినిమాలో మల్లి పాత్ర రాశి సరికొత్త ఐడెంటిటీని తీసుకొచ్చింది. ఇప్పటి టాలీవుడ్ భామలకి ఈ ముగ్గుర్ని అన్వయించి మాట్లాడితే? ఆ ముగ్గురికి పోటీ లేదని చెప్పాలి. అంతటి లెగస్సీని అందుకోవడం ఇప్పటి భామలతో సాధ్యకాని పని అని చెప్పొచ్చు. వాళ్ల ఛాయల్లోకి స్వీటీ అనుష్క మాత్రమే చేరింది. టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్...తమన్నా లాంటి వారిది లాంగ్ జర్నీ అయినా? ఆ ముగ్గురికి పోటీ కాదనే చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.