ఒకేసారి ఇటు టాలీవుడ్ అటు మల్లూవుడ్.. హాట్ బ్యూటీ మాస్టర్ ప్లాన్..!

Update: 2022-07-05 01:30 GMT
దాదాపు ఇరవై ఏళ్ళ కిందట సినీ రంగంలో ప్రవేశించిన ఓ హాట్ బ్యూటీ.. ఆ తర్వాత రోజుల్లో బుల్లితెర మీద సత్తా చాటింది. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ అద్దిన ఈ భామ.. తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే క్రేజీ ఆఫర్స్ అందుకుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈమె.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట చిచ్చు రేపుతుంది. ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఆమె తన యాక్టింగ్ కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీని కోసం తనకు పాపులారిటీ తెచ్చిపెట్టిన కొన్ని బుల్లితెర షోలు కూడా వదులుకుంటోందని సమాచారం.

40కి చేరువలో ఉన్నందున వెండితెరపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తోందని టాక్. ఆ మధ్య ఓ పాన్ ఇండియా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ భాషలోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఓ మాలీవుడ్ సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

డెబ్యూ మలయాళ మూవీ భారీ సక్సెస్ అవడంతో అమ్మడు ఇప్పుడు ఆ ఇండస్ట్రీలోనే మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మల్లూవుడ్ ను లక్ష్యంగా చేసుకుని.. ప్రయత్నాలు మొదలు పెడుతోందని టాక్. అలానే తెలుగులో సూపర్‌ సీనియర్‌ హీరోలకు జోడీగా నటించాలని ఆశ పడుతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆమె ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటోందని టాక్. ఐదు రోజుల కంటే తక్కువ షూటింగ్ ఉన్న పాత్రలు చేయడం లేదట. ఈ విషయాన్ని మేకర్స్ తో కరాకండిగా చెప్పేస్తోందట. ఇందులో భాగంగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడంతో పాటు, గ్లామరస్ మరియు బోల్డ్ పాత్రలకు కూడా సై అంటోందని అంటున్నారు.
 
అలాగే పాత్ర నచ్చితే వెబ్ సిరీస్‌ లలో కూడా నటించడానికి అందాల ముద్దుగుమ్మ సిద్ధంగా ఉందని టాక్ నడుస్తోంది. ఇటు టాలీవుడ్ అటు మాలీవుడ్ లలో రాణించాలని ఈ బ్యూటీ మంచి ప్లాన్ తోనే వెళ్తోంది. ఆల్రెడీ ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి సక్సెస్ అయితే నెక్స్ట్ లెవల్ కు రీచ్ అవుతుంది. మరి రానున్న రోజుల్లో అమ్మడి యాక్టింగ్ కెరీర్‌ ఎలా సాగుతుందో చూడాలి.
Tags:    

Similar News