ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయం నుంచి ఏ ఈ-పేపర్ తిరగేసినా.. ఓ వెబ్ సైట్ చూసినా.. సోషల్ నెట్వర్కింగ్ లో ఏ పోర్టల్ ఓపెన్ చేసినా.. అంతా పవన్ మయం అయిపోయింది. ఇటు సినిమాల్లో టాప్ పొజిషన్ లో వెలిగిపోతున్న పవన్ కళ్యాణ్.. అటు రాజకీయాల్లోనూ కీలక నేతగా ఎదగడంతో.. రాజకీయ వర్గాల నుంచి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు నారా లోకేష్ పవన్ ను ప్రత్యేకంగా విష్ చేశారు. ఇక సినిమా రంగానికి వస్తే.. ఆయన కుటుంబం నుంచి దాదాపు ప్రతీ ఒక్కరు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. వరుణ్ తేజ్.. సాయిధరం తేజ్.. అల్లు శిరీష్ లతో పాటు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా విషెస్ పోస్ట్ చేసింది. ఇతర హీరోలు అయిన రామ్ పోతినేని. మంచు విష్ణు.. సుమంత్ నిఖిల్ విషెస్ చెప్పారు. నటీమణుల్లో కాజల్.. ప్రణీత.. రకుల్ ప్రీత్ సింగ్.. శృతి హాసన్.. అనసూయ.. అను ఇమాన్యుయేల్.. సంజన.. రాయ్ లక్ష్మిలు పవర్ స్టార్ కు స్పెషల్ విషెస్ చెప్పారు.
దర్శకుల్లో హరీష్ శంకర్.. బాబీలు పవన్ ను విష్ చేయగా.. సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్.. అనిరుధ్.. అనూప్ రూబెన్స్ లు పవర్ స్టార్ పవర్ ను తెగ పొగిడేశారు. చంద్రబాబు వంటి రాజకీయ నాయకులు కూడా విష్ చేయగా.. మంచు విష్ణు ఫ్యామిలీకి పవన్ కు పడదని చాలా మంది అనుకుంటే.. విష్ణు ట్వీట్ చేయడం షాక్ కలిగించే విషయమే. కొందరి పేర్లు రాస్తేనే జాబితా ఈ రేంజ్ లో ఉందంటే.. వాళ్లంతా పెట్టిన ట్వీట్స్ చూస్తే ఔరా..దటీజ్ పవన్ పవర్ అనుకోవాల్సిందే.
చంద్రబాబు నాయుడు: హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు.. ప్రజల కోసం మీరు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు చాలా గొప్పవి. ఇదే ఉత్సాహంతో కొనసాగుతారని ఆశిస్తున్నాను
నారా లోకేష్ : పవన్ కళ్యాణ్ గారికి బర్త్ డే గ్రీటింగ్స్.. మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటాను
రామ్ చరణ్: అర్ధం చేసుకునే నీలాంటి బాబాయ్ ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతుడిని. నిజాయితీగా ఉండడం నీ దగ్గరే నేర్చుకున్నా బాబాయ్. మిలియన్స్ లో ఒకడైన వ్యక్తికి హ్యాపీ బర్త్ డే
అల్లు అర్జున్: మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు PSPKగారు
వరుణ్ తేజ్: తెలుగు సినిమాకు పవర్ హౌస్
సాయిధరం తేజ్: ‘బాబాయే అబ్బాయి అయితే ఎలా ఉంటుంది?... కాదు కాదు.. బాబాయి కూడా అబ్బాయే..’. అంటూ చిరు-పవన్ ల ఫోటోను ఉద్దేశించి పోస్ట్ చేశాడు తేజు
అల్లు శిరీష్ : హ్యాపీ బర్త్ డే కల్యాణ్ బాబాయ్.. మీరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాను
రేణూ దేశాయ్: సమాజం కోసం.. ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా కష్టపడే వ్యక్తి. ఎంతో ఆరోగ్యంగా ఉండాలని.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటా
రామ్ పోతినేని: డబ్బు-ప్రేమ-కుటుంబం-అనేక త్యాగాలు.. ఎన్నెన్నో చేశారు. దీని రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాను
నితిన్: నా కొత్త సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్.. నా తండ్రి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది
మంచు విష్ణు: పవన్ కళ్యాణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వచ్చే ఏడాది ఈ పాటికి రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తారని ఆశిస్తున్నా
సుమంత్ : మెనీ హ్యాపీ రిటర్న్స్.. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్
నిఖిల్ :మీతో మేం నడుస్తాం సార్. మాకు స్ఫూర్తి మాత్రమే కాదు.. ఓ మంచి మనిషి అనేందుకు మీరు చిహ్నం. పవర్ స్టార్ మాకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటారు. లాంగ్ లైఫ్ టు యు
కాజల్: వండ్రఫుల్ యాక్టర్.. మంచి వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
ప్రణీత: పవన్ కళ్యాణ్ సార్ కి వెరీ హ్యాపీ బర్త్ డే
రకుల్ ప్రీత్ సింగ్: హ్యాపీ బర్త్ డే టు వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారూ.. మీరు చేపట్టే అన్ని పనులు సక్సెస్ కావాలని కోరుకుంటా
శృతి హాసన్: పవన్ కళ్యాణ్ గారికి ఇదే నా పుట్టిన రోజు శుభాకాంక్షలు
అనసూయ: మీరు ఒక కారణంతో పవర్ స్టార్ అయ్యారు. మీరు మాకు కావాలి. మీ శక్తి ఎప్పుడూ నిట్టనిలువుగా ఉండాలని కోరుకుంటున్నాను
అను ఇమాన్యుయేల్: సింప్లిసిటీ.. దయ.. నిస్వార్ధం గల వ్యక్తికి బర్త్ డే విషెస్
సంజన: పవర్ స్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు మరింత శక్తి, విజయాలను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను
రాయ్ లక్ష్మి: ఓ మహాద్భుతమైన వ్యక్తి పవన్ కల్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
హరీష్ శంకర్: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి బర్త్ డే విషెస్. నా జీవితాన్ని ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి. ఐ లవ్ యూ మై గబ్బర్ సింగ్
బాబీ: వద్దని ఎవరూ అనుకోలేని స్టార్.. ఎవరూ ప్రశ్నించలేని పుట్టుక. ఎవరూ మర్చిపోలేని ఓ మహా వ్యక్తి.. ఎవరూ తప్పించుకోలేని ఓ మ్యాజిక్
దేవిశ్రీ ప్రసాద్: అత్యంత సంతోషకరమైన మ్యూజికల్ అండ్ హ్యాపీయస్ట్ బర్త్ డే టు పవన్ కళ్యాణ్ సార్. కీప్ రాకింగ్ ఆల్వేస్
అనిరుధ్ రవిచందర్: హ్యాపీ బర్త్ డే టు పవర్ స్టార్.. ఆయన బర్త్ డే సందర్భంగా ఓ స్నిపెట్
అనూప్ రూబెన్స్ : ఇప్పటివరకూ నేను కలిసిన వ్యక్తులలో ఓ అద్భుతం పవర్‌స్టార్. పవన్‌కల్యాణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు
పరుచూరి గోపాలకృష్ణ: జనాలనే సేనగా మార్చి.. జనం కోసం జనం లోకి వస్తున్న జన సేనాని పవన్‌కల్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
వెన్నెల కిశోర్: వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు