వైజాగ్ రాజధాని భూమ్ ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రాజధాని ఫ్యాక్టర్ విశాఖ ఔట్ స్కర్ట్స్ సహా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో రియల్ భూమ్ కి తెర లేపుతోంది. అలాగే రాజధాని ప్రతిపాదిత ప్రాంతం అయిన కాపులుప్పాడ- భీమిలి పరిసరాల్లో భూముల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. అలాగే వైజాగ్ రాజధాని ఏర్పాటు అనంతరం విశాఖ రామానాయుడు పరిసరాలు సహా కొత్త వలస- అరకు మధ్య ఎర్రమట్టి నేలల్లో సరికొత్త టాలీవుడ్ నెలకొల్పాలన్న ప్రతిపాదనను పర్యాటక మంత్రి.. కాబోయే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా పలువురు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదించారని అందుకు ఆయన సానుకూలతను వ్యక్తపరిచారని లీకులు అందుతున్నాయి.
ఇక బీచ్ సొగసుల వైజాగ్ లో మెగాస్టార్ చిరంజీవి భారీ స్టూడియోని నెలకొల్పే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. విశాఖ భీమిలి సహా పలుచోట్ల మెగా ఫ్యామిలీకి భారీగా భూములు ఉన్నాయన్న ప్రచారం ఉంది. చిరంజీవికి భీమిలికి కూతవేటు దూరంలో అమనామం అనే విలేజ్ పరిసరాల్లో భారీగా భూములున్నాయి. భీమిలికి 20 కి.మీల దూరంలోని అమనామంలో 150-167 ఎకరాల వరకూ ఉంటుందని ఓ ప్రముఖ రియల్ ఏజెంట్ వెల్లడించారు.
అలాగే భీమిలి నుంచి తగరపు వలస వెళ్లే దారిలో దర్శకధీరుడు రాజమౌళికి ఎకరంన్నర ఉందని స్థానిక రియల్ వ్యాపారులు వెల్లడించారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణకు ఇక్కడ స్థానికంగా ల్యాండ్స్ ఉన్నాయి. ఘట్టమనేని రిసార్ట్స్ పేరుతో భీమిలికి 18 కిలోమీటర్ల దూరంలోనే నీలకుండీలు జంక్షన్ వద్ద భారీగా భూములు ఉన్నాయి. సంగీత దర్శకుడు థమన్ కి ఒక రికార్డింగ్ స్టూడియో కట్టుకునేంత స్థలం భీమిలి పరిసరాల్లో ఉంది. అక్కడ రికార్డింగ్ కార్యక్రమాలు చేయడం థమన్ కి అలవాటు.
హీరో శ్రీకాంత్ కి విజయనగరం వైపు లే ఔట్ లు ఉన్నాయి. ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన క్రమంలో కొన్ని ఫ్లాట్లు దఖలు పరిచారట. జగపతిబాబు ఇంతకుముందు కొన్ని లే ఔట్ లకు ప్రచారం చేసినప్పుడు వాటిలో కొన్ని ఫ్లాట్లను కేటాయించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పేరం గ్రూప్ ప్రచారకర్తగా ఉన్నారు. ఈ గ్రూప్ కి భీమిలి కి 30 కి.మీ దూరంలో ఆనందపురం జంక్షన్ సహా పలు చోట్ల భారీగా భూములున్నాయి. వెంచర్లు లే ఔట్లలో వీరికి కొన్ని ఫ్లాట్లు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు.. పరిశ్రమకు చెందిన ఎందరో హీరోలు.. టెక్నీషియన్లు.. ఆర్టిస్టులు వైజాగ్ కు టాలీవుడ్ షిఫ్ట్ అవుతుందన్న నమ్మకంతో భారీగా భూములు కొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం యువ సీఎం ఊపు చూస్తుంటే రాజధాని దాంతో పాటే టాలీవుడ్ తరలి రావడం ఖాయమని భీమిలి- కాపులుప్పాడ సహా వైజాగ్ పరిసరాల్లో విపరీతమైన ప్రచారం సాగుతోంది. రాజధాని భూమ్ నేపథ్యంలో సెలబ్రిటీల భూముల ధరలు చుక్కల్ని తాకాయని ప్రముఖ రియల్ వ్యాపారి తుపాకికి ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించారు.