పెళ్లిచూపులు మూవీకి రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ ఉంది. మెల్లగా టాక్ ఊపందుకుంటున్న టైమ్ లో.. రాజమౌళి చేసిన కామెంట్స్ సినిమాను పీక్స్ కు పట్టుకెళ్లిపోయాయి. ఆయన ఇచ్చిన మినీ రివ్యూ కారణంగా యూత్ అంతా సినిమాను చూడ్డానికి ఇంకా ఎగబడుతున్నారు అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇప్పుడు మరింతమంది సెలబ్రిటీలు పెళ్లి చూపులను అభినందిస్తూ ట్వీట్స్ పెడుతూ.. రాజమౌళికి తోడవుతున్నారు. పెళ్లిచూపులకు ఇతర సెలబ్రిటీలను క్యూ కట్టిస్తున్నారు.
'ఇప్పుడే పెళ్లి చూపులు చూసి ఈ వారాన్ని సూపర్ గా స్టార్ట్ చేశా. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నట్లుగా ఉంది. మీరంతా ఇరగదీసేశారు. పెళ్లిచూపులు టీమ్ ని గట్టిగా అభినందించాల్సిందే' అని ట్వీట్ చేశాడు అక్కినేని నాగ చైతన్య. 'పెళ్లిచూపులు అద్భుతమైన సినిమా. విజయ్-రీతు-నందు అందరూ సూపర్ గా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ఫ్రెండ్ కేరక్టర్ అయితే విపరీతంగా నవ్వించింది. దర్శకుడితోపాటు టీమ్ అందరికీ కంగ్రాట్స్' అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. సెలబ్రిటీల ట్వీట్లతో ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోతోంది. ఇప్పటికే మాంచి వసూళ్ళు వస్తుంటే.. ఈ దెబ్బకి ఇంకా పెరిగే ఛాన్సుంది మరి.
చాలా అరుదుగా ఒక సినిమాకు ఇన్నేసి పాజిటివ్ రివ్యూలు వస్తుంటాయి. అదేంటో కాని.. ఈ సినిమా తీయడానికి ముందు సదరు దర్శకుడు ఇదే కథను చాలామందికి చెప్పినా కూడా వాళ్లకి కిక్ రాలేదు. కాని సినిమా చూశాక వారే ఇప్పుడు వావ్ అంటున్నారు. అదంతా ఫేట్ అని అనుకోవాలి అంతే!!