కరోనా సెకండ్ వేవ్ తరువాత మెల్లమెల్లగా సినీ పరిశ్రమ ట్రాక్ లోకి వస్తోంది. ఇటీవల కాలంలో అనేక చిన్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవ్వగా.. కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం ఇతర ఫిలిం మేకర్స్ ధైర్యాన్ని ఇచ్చింది. అక్టోబర్ నుంచి వరుసగా సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈరోజు మొదలుకుని ఈ నెల చివరి వరకు అనేక సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.
దసరా బరిలో నిలిచే సినిమాల మీద కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లు భారీ బడ్జెట్ చిత్రాలు రాకపోయినా.. క్రేజీ చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'Rx100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ''మహాసముద్రం'' అక్టోబర్ 14 న విడుదలవుతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.
అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ రూపొందించిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. లేటెస్టుగా రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ''వరుడు కావలెను'' చిత్రాన్ని అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందించారు. ఇక దసరా బరిలో దిగుతున్న విశాల్.. ఇప్పుడు వెనక్కి తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఆర్య తో కలిసి విశాల్ నటించిన ''ఎనిమీ'' చిత్రాన్ని ముందుగా విజయ దశమి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచలో పడినట్లు టాక్ నడుస్తోంది.
ఇప్పటికే దసరా బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేయబోయేది మూడు సినిమాలు మాత్రమే. రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతాయేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో పండుగ నాటికి థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ రావడంతో పాటుగా టికెట్ల రేట్ల విషయంలో సానుకూల స్పందన వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఈ మూడు సినిమాలు మంచి వసూళ్ళు సాధించుకునే అవకాశం ఉంది.
ఇకపోతే అక్టోబర్ నెల బాక్సాఫీస్ ఈరోజు 'రిపబ్లిక్' సినిమాతో ప్రారంభమైంది. సాయి తేజ్ - డైరెక్టర్ దేవకట్టా కాంబినేషన్ లో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. ఈ వారాంతంలో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. రేపు గాంధీ జయంతి నాడు శ్రీకాంత్ - సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇదే మా కథ' సినిమా రిలీజ్ అవుతోంది. అలానే సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రం 'కొండ పొలం' అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన 'పెళ్లి సందD'' చిత్రాన్ని కూడా అక్టోబర్ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న 'రౌడీ బాయ్స్' చిత్రం ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం థియేటర్స్ మరియు టికెట్ రేట్స్ మీద తీసుకునే నిర్ణయంతో మరికొన్ని చిత్రాల విడుదల తేదీలను ప్రకటించనున్నారు.