టాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ కి, స్టార్ హీరోలకు సంక్రాంతి సమరం అత్యంత కీలకం. ఈ ఫెస్టివెల్ కి సినిమాని బరిలోకి దింపాలని చాలా మంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు సెంటిమెంట్ గా భావిస్తుంటారు. భారీ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సినిమాలని పోటా పోటీగా రిలీజ్ చేస్తుంటారు. ఈ ఏడాది కరోనా కారణంగా సంక్రాంతి ఫైట్ కి ఏ హీరో రంగంలోకి దిగకపోవడంతో ఇప్పడు అందరి దృష్టి 2023 సంక్రాంతి సమరంపై పడింది.
సంక్రాంతికి ఇంకా మూడు నెలలకు పైనే టైమ్ వుంది. అయితే ఈ పండగ సీజన్ లో ఏఏ స్టార్స్.. ఏఏ సినిమాలో పోటీకి దిగుతున్నారన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పటి వరకైలూ ప్రభాస్ `ఆది పురుష్`, మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) సంక్రాంతికి వస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చేశాయి. మిగతా వాటి విషయంలోనే ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. సినిమాల షూటింగ్ లు ఎండింగ్ దశకు చేరబోతున్నా రిలీజ్ డేట్ లని మాత్రం మేకర్స్ తేల్చడం లేదు.
ఇందులో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ ప్రాజెక్ట్ కూడా వుంది. `అఖండ` బ్లాక్ బస్టర్ హిట్ తో ట్రాక్ లోకి వచ్చేసిన బాలయ్య తన 107వ సినిమాని గోపీచంద్ మలినేనితో చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్ నవంబర్ తో పూర్తి కాబోతోంది. మేకర్స్ మాత్రం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే బాలయ్య మాత్రం సంక్రాంతికే రావాలని భావిస్తున్నారట. మైత్రీ వారు ఈ మూవీతో పాటు చిరంజీవి నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి ఫిక్స్ అయింది. ఒకే టైమ్ లో తమ రెండు సినిమాలు పోటీ పడటం ఇష్టం లేకే బాలయ్య సినిమాని క్రిస్మస్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
కానీ బాలయ్య ఏమంటాడన్నది ఇప్పడు సస్పెన్స్ గా మారింది. ఇక వీటితో పాటు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న `వారసుడు` కూడా సంక్రాంతి సమరానికి సై అంటోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ పొంగల్ బరిలో దిగాలని విజయ్ ఫిక్సయ్యాడు. దీంతో దిల్ రాజు ఈ మూవీని తెలుగులోనూ సంక్రాంతికి రిలీజ్ చేయడం ఖాయం అయిపోయింది.
ఇక అఖిల్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ `ఏజెంట్` రిలీజ్ విషయంలో ఇప్పటికీ కర్ఫ్యూజన్ రన్నవుతోంది. ఇప్పటికే రెండు మూడు రిలీజ్ డేట్ లని మార్చేశారు. తాజాగా ఆగస్టు 12న రిలీజ్ అని ప్రకటించినా షూటింగ్ ఆలస్యం, రీ షూట్ ల కారణంగా ఈ మూవీ డిసెంబర్ కు కూడా రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సంక్రాంతికి వుంటుందా? అన్నది కూడా క్లారిటీ లేదు. దీంతో సంక్రాంతి ఫైట్ వున్నాట్టా లేనట్టా అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆది పురుష్, వాల్తేరు వీరయ్య, వారసుడు సినిమాలు సంక్రాంతికి రావడం దాదాపుగా కన్ఫమ్ అయిపోయింది. మిగతా సినిమాలు కూడా కన్ఫమ్ అయితే సంక్రాంతి సమరం రసవత్తరంగా సాగడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.