ఎన్నికలు ముగిశాయి. నిన్నటి దాకా ప్రచారాల హోరుతో గెలుపోటముల గురించి విశ్లేషణలతో తీరిక లేకుండా గడిపిన జనం ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. మెల్లగా సినిమా మూడ్ లోకి మళ్లుతున్నారు. గత రెండు నెలలుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్టు లేక కుదేలైన టాలీవుడ్ కు ఏప్రిల్ నెల మొదటి వారంలో మజిలి రూపంలో మంచి ఆక్సిజన్ దొరికింది. చైతుకే కాదు ట్రేడ్ ని సైతం హ్యాపీగా ఫీలయ్యేలా చేసిన దీని వసూళ్లు ఇలాగే స్టడీగా ఉంటే కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు కావడం ఖాయం.
ఇవాళ సాయి ధరం తేజ్ చిత్రలహరి విడుదల అవుతోంది. గత సినిమాలతో పోల్చుకుంటే ప్రీ రిలీజ్ పరంగా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేసిన ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేలా ఉన్నాయి. మజిలి తరహాలో ఇదీ హిట్టు బాట పడితే టికెట్ కౌంటర్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. తేజుకు అందని ద్రాక్ష పండులా నిలిచిన సక్సెస్ దక్కిందో లేదో ఇంకొద్ది గంటల్లో తెలిసిపోతుంది
ఇక వచ్చే వారం నాని జెర్సీ రాబోతోంది. ఐపిఎల్ ఫీవర్ తో దేశమంతా ఊగిపోతున్న తరుణంలో సరైన సమయంలో నాని క్రికెటర్ పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా నాని ఎన్నడూ లేనిది దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు మీడియా ప్రెస్ మీట్ లో కనిపించింది. ఎమోషన్స్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కి లోటు లేకుండా దర్శకుడు గౌతం తిన్ననూరి దీన్ని తీర్చిదిద్దినట్టు యూనిట్ చెబుతోంది. గత ఏడాది రెండు పరాజయాలు చవి చూసిన తరుణంలో జెర్సీ హిట్ కావడం చాలా అవసరం.
ఇక 25న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీత వస్తుంది. ఇప్పటికి డేట్ అదే అన్నట్టు ఉంది కాని ఏదైనా అనూహ్యమైన మార్పు ఉంటే చెప్పలేం. మొత్తానికి హైప్ ఉన్న సినిమాలతో ఏప్రిల్ బాగా కళకళ లాడేలా కనిపిస్తోంది. ఎన్నికలు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తెలుగు వారికి సినిమా కన్నా మంచి ప్రత్యాన్మాయం ఉంటుంది