హీరో కొడుకు ప్రేమ వ్యవహారంతో గొడవ

Update: 2016-05-26 06:48 GMT

ఓ స్టార్ హీరో ఇంట్లో జరిగిన గొడవ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. హీరోలయిన తండ్రీ కొడుకులు గొడవ పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం హీరో గారి కొడుకు ప్రేమ వ్యవహారమే అంటున్నారు. చాలా కాలంగా ఈ కుర్రహీరో తన తోటి హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు. ఇక పెళ్లి చేసేసుకోవాలన్నది అతని ఐడియా. ఇప్పుడు అదే ఇంట్లో గొడవకు కారణమైంది.

తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకరినొకరు అరుచుకున్నారని తెలియడంతో.. ఈ వ్యవహారంపై టాలీవుడ్ ఆసక్తిగా చూస్తోంది. ఏళ్ల తరబడి ప్రేమ కంటిన్యూ కావడంతో.. ఇక పెళ్లి చేసేసుకోవాలని చూస్తున్నాడు కుర్రాడు. కానీ ఇంట్లో మాత్రం ఆ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. కొడుకు ప్రేమించడం కరెక్టే అయినా.. ఆ అమ్మాయి కరెక్ట్ కాదని చెప్పేందుకు ఆ తండ్రి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట.

గత కొన్ని రోజులుగా కుటుంబంలో ఈ వివాదం కంటిన్యూ అవుతోందని తెలుస్తోంది. లవర్ విషయంలో ఎట్టి పరిస్థితిల్లోనూ వెనక్కి తగ్గేది లేదని కుర్ర హీరో తేల్చేయడంతో.. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ తండ్రి. మరి ఈ ప్రేమ వ్యవహారం, దాంతో మొదలైన కుటుంబ వివాదం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అని ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News