గతేడాది వైజాగ్ ని హుద్ హద్ తుఫాన్ ముంచెత్తింది. ఈ సమయంలో టాలీవుడ్ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. వైజాగ్ లో ఓ పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే తెలుగు రాష్ట్రంలో ఓ ప్రాంతానికి కష్టం వస్తే.. తెలుగు నటులు స్పందించడం చెప్పుకోదగ్గ విషయమేమీ కాదు.
సూర్య - రజినీకాంత్ సహా పలువురు తమిళనటులు కూడా వైజాగ్ కి వచ్చిన కష్టానికి వెంటనే స్పందించారు. లక్షల కొద్దీ విరాళాలు అందించారు. వాళ్లకి ఇక్కడ మార్కెట్ ఉండడం సెకండరీయే. సాయం చెయ్యాలనే రూల్ ఏమీ ఉండదు. అలా చేసేందుక చెయ్యి రావాలంతే. కానీ ఇప్పుడు చెన్నై నిలువెత్తు కష్టంలో ఉంది. తుఫాన్ కారణంగా నగరంలో చాలా భాగం మునిగిపోయింది. అయితే ఇప్పటివరకూ ఒక్క తెలుగు హీరో కూడా తమిళనాడుకు వచ్చిన కష్టానికి స్పందించలేదు.
ఎక్కడో నేపాల్ లో భూకంపం వస్తే... రామ్ చరణ్ సహా చాలామంది విరాళాలు ఇచ్చారు. ఆదుకుంటామని ముందుకొచ్చారు. తాము తోడున్నామని చెప్పారు. కానీ వీళ్లు తమిళ మార్కెట్ ని దక్కించుకోవడానికి కష్టపడుతున్నారు కానీ.. అక్కడ వచ్చిన కష్టానికి మాత్రం ఇంకా స్పందించలేదు. బహుశా అక్కడ ఎక్కువగా ప్రాణహాని జరగలేదు కదా అని ఆలోచిస్తున్నారేమో ?