ఆమెతో సెవెన్ .. వారికి హెవెన్

Update: 2015-10-20 19:30 GMT
తెలుగు సినిమాలలో 'లక్కీ హ్యాండ్'కున్న గుర్తింపు అంతా ఇంతాకాదు. అణువంత టాలెంట్ తక్కువున్నా పర్లేదు కానీ లక్కీ హ్యాండ్ - గోల్డెన్ లెగ్ అన్న ముద్రలు పడ్డాయంటే చాలు ఇంక వెనుతిరిగి చూడనవసరం లేదు. ఒక్కసారి వెనక్కు వెళితే మతిచెలించే అందాలతో ప్రేక్షకులని మంత్రం ముగ్ధుల్ని చేసిన భూమికా చావ్లా నేటి టాప్  హీరోలకు లక్కీ హ్యాండ్ గా నిలిచి బ్లాక్ బస్టర్లకు  తోడయ్యింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే  ఆ సినిమాలన్నీ ఆయా హీరోలకు 7వ చిత్రం కావడం..

అప్పటికే బద్రి - తమ్ముడు సినిమాలతో యూత్ కి దగ్గరైన పవన్ కళ్యాణ్ 'ఖుషి' చిత్రంతో స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. సిద్ధూగా పవన్ - మధుగా భూమికల నటన సూర్య  దర్శకత్వం మణిశర్మ సంగీతం ఈ సినిమాలకు ఆయువుపట్టుగా నిలిచాయి. పవన్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా ఖుషి నిలిచింది.

స్టూడెంట్ నెంబర్ 1 - ఆది సినిమాల విజయాలతో మాస్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్ కి సింహాద్రి 7వ సినిమా. ఈ సినిమాలో కూడా భూమికకే హీరోయిన్. రాజమౌళి యాక్షనిజాన్ని భీభత్సమైన రీతిలో మనకు పరిచయం చేసి సంచలనాత్మక విజయాన్ని అందుకున్నారు.

స్వప్న .. ఐ లవ్ యు అంటూ ఓబుల్ రెడ్డి చేసే రచ్చని మన ఒక్కడు మహేష్ బాబు ఎలా అరికట్టాడు అన్న నేపధ్యంలో గుణశేఖరుడి ఒక్కడు కూడా మహేష్ కి 7వ సినిమానే . ఈ సినిమాలో కూడా భూమిక పాత్ర చుట్టూనే కధ తిరగడం విశేషం. కాబట్టి మన స్టార్ హీరోలకి భూమిక లక్కీ హ్యాండ్ ఏ కదా... 
Tags:    

Similar News